Share News

ఓఎన్జీసీ గ్యాస్‌ పైపులైన్‌ పేలుడు.. నష్టం అంచనాకు బృందం నియామకం

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:34 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): యానాం సమీపంలోని దరియాల తిప్ప వద్ద ఆగస్టు 22న ఓఎన్జీసీ గ్యాస్‌ పైపులైన్‌ పేలడం వల్ల జరిగిన నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడానికి బృందాన్ని నియమించామని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగ

ఓఎన్జీసీ గ్యాస్‌ పైపులైన్‌ పేలుడు..  నష్టం అంచనాకు బృందం నియామకం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల, మాజీ మంత్రి మల్లాడి

కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): యానాం సమీపంలోని దరియాల తిప్ప వద్ద ఆగస్టు 22న ఓఎన్జీసీ గ్యాస్‌ పైపులైన్‌ పేలడం వల్ల జరిగిన నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడానికి బృందాన్ని నియమించామని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, మత్స్యశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పేలుడు ఘటనతో మత్స్య సంపదకు ఎంతవరకు నష్టం జరిగింది, మత్స్యకారుల జీవన భృతికి ఏ విధంగా ఆటంకం ఏర్పడింది అనే విషయాలపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ న ష్టాన్ని అంచనా వేయడానికి సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (విశాఖపట్నం)కు చెందిన డాక్టర్‌ జో నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియ మించారన్నారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న గ్రామాలను, ఎక్కువ నష్టం జరి గిన కోర్‌ గ్రామాలను, ఫెర్రీ ఫ్రీ గ్రామాలను నిర్ధారిం చాలని బృందాన్ని కోరామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాలని కోరామన్నారు. సముద్రం, నది, నది ముఖద్వారాల వద్ద బోట్లు తిరగడానికి ఆటంకంగా ఉన్న ఇసుక మేటలను తొల గించాలన్నారు. తుది రిపోర్టును వారంలో ఇవ్వాలని బృందాన్ని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ కోరారు. సమావేశం లో అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ డాక్టర్‌ అంజలి, జిల్లా మత్స్య శాఖ అధికారి కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:34 AM