స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు వేగవంతం
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:06 AM
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయంఉపాధి యూనిట్లు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి మంగళ వారం జిల్లా కలెక్టర్, నూతన ట్రైనీ కలెక్టర్ జె.మనిషాతో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రధానమంత్రి
జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయంఉపాధి యూనిట్లు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి మంగళ వారం జిల్లా కలెక్టర్, నూతన ట్రైనీ కలెక్టర్ జె.మనిషాతో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద జిల్లాలో అర్హులైన వారందరికీ సోలార్ రూఫ్ ఏర్పాటు కృషిచేయాలన్నారు. ఈ పఽథకం కింద బీసీ, ఓసీ వర్గాల్లోని అర్హులైన లబ్ధిదారులకు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు అవగాహన కల్పించి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు ప్రక్రియ వేగ వంతం చేయాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలందరికీ పీఎం సురక్ష, పీఎం జీవన్ జ్యోతి యోజన పథకాల ద్వారా బీమా నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. పీఎం సురక్షకి రూ.20, పీఎం జీవన్ జ్యోతికి రూ ప్రీమియం ప్రతి ఉపాధి కూలీతో కచ్చితంగా కట్టించాలన్నారు. సమావేశంలో జెడ్పీసీఈవో లక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఏపీఈపీ డీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.