స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:28 AM
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ హాలులో స్వాత్రంత్య వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి ప
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ హాలులో స్వాత్రంత్య వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. విద్యార్థు లతో సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటుకు ముందుస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖల ప్రగతి నివేది కలను బుధవారంలోగా పంపించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లను అవార్డులకు సిఫార్సు చేయాలన్నారు. అవార్డు లకు గౌరవం పెరిగేలా ఉత్తమ పనితీరు కనబర్చిన వారిని మాత్రమే గుర్తించి వారి పేర్లను ఈనెల 7వ తేదీలోపు పంపించాలన్నారు. పోలీసు పరేడ్ మైదా నంలో 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జరిగే వేడుకలకు ప్రజలు, స్వా తంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనన్నా రు. వేదిక, సీట్లు, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ ఆధ్వ ర్యంలో ముందుగానే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. అందరికీ సరిపడేలా తాగునీరు సమకూర్చాలన్నారు. పోలీసు, ఎన్‌సీసీ విభాగాల వారు గార్డ్ ఆఫ్ హానర్, పరేడ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. అతిథులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కల గకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిచూసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు భాగసాములవుతారని, ఈ మేరకు సిటింగ్ ఏర్పాట్లు చేయాలన్నా రు. సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్, జేసీ రాహుల్ మీనా పాల్గొన్నారు.