Share News

పేదల వైద్యానికి సహకారం అమోఘం

ABN , Publish Date - May 05 , 2025 | 11:31 PM

జీజీహెచ్‌ (కాకినాడ), మే 5 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ (కెఎస్‌పీ ఎల్‌) అందించిన సహాయ, సహకారాలు అమో ఘమైనవని కాకినాడ జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ కొనియాడారు. జీజీహెచ్‌ ట్రామా కేర్‌ విభాగంలో సోమవారం కెఎస్‌పీఎల్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటి (సీఎస్‌ఆర్‌)లో భాగంగా రూ.55 లక్షలతో సమకూర్చిన 3 వెంటిలేటర్‌లు, 8 మల్టీపారా మానిటర్‌లు, 8 ఐసీయూ పడక లు,

పేదల వైద్యానికి సహకారం అమోఘం
ఐసీయూలో పడకలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

కలెక్టర్‌ షాన్‌మోహన్‌

‘కెఎస్‌పీఎల్‌’ రూ.55 లక్షలతో జీజీహెచ్‌కు మౌలిక సదుపాయాలు

జీజీహెచ్‌ (కాకినాడ), మే 5 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ (కెఎస్‌పీ ఎల్‌) అందించిన సహాయ, సహకారాలు అమో ఘమైనవని కాకినాడ జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ కొనియాడారు. జీజీహెచ్‌ ట్రామా కేర్‌ విభాగంలో సోమవారం కెఎస్‌పీఎల్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటి (సీఎస్‌ఆర్‌)లో భాగంగా రూ.55 లక్షలతో సమకూర్చిన 3 వెంటిలేటర్‌లు, 8 మల్టీపారా మానిటర్‌లు, 8 ఐసీయూ పడక లు, 8 గైనకాలజీ పరిశీలన బెంచీలను సంస్థ ఎ ండీ కెవిరావు, కలెక్టర్‌, ఎంపీ తం గెళ్ళ ఉదయ్‌శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకుడు మ ర్రెడ్డి శ్రీనివాస్‌ సమక్షంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం. పాండురంగ విఠల్‌కు అప్ప గించారు. అనంతరం సర్జరీ సెమినా ర్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జీజీహెచ్‌కు రూ.55 లక్షలతో మౌలిక సదుపాయాలను సమకూర్చడం అభినందనీయమని కేఎస్‌పీఎల్‌ ఎండీ కేవీ రావుకు ప్రతే ్యక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ఉదయ్‌ మాట్లాడుతూ నాలుగైదు జిల్లాల నుంచి నిత్యం రోగులు, క్షతగాత్రులు, గర్భిణులు వేల సంఖ్యలో జీజీహెచ్‌కు వస్తుంటారన్నారు. గతేడాది 8 లక్షలమంది అవు ట్‌ పేషెంట్లు, 17 వేలమంది ఇన్‌పేషెంట్లు జీజీహెచ్‌లో వైద్య సేవలు పొందగా, సుమారు 45 వేల సర్జరీలు జరగడం గర్వకారణమన్నారు. జీజీహెచ్‌ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులుగా తాము, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేశామన్నారు. జీజీహెచ్‌ భవిష్యత్తుతరాలకు వైద్య సేవలనం దించే నిష్ణాతులైన వైద్య నిపుణులను అందిస్తుందని ఆకాంక్షించారు. ముఖ్యంగా క్యాన్స ర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యం లో త్వరలో జీజీహెచ్‌లో ప్రత్యేక క్యాన్సర్‌ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ ప్రత్యేక ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలందిం చడంలో జీజీహెచ్‌ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. గతంలో కెఎస్‌పిఎల్‌ జీజీహెచ్‌కు చాలాసార్లు సహకారాన్ని అందించదని గుర్తుచేశారు. ఎంసీ హెచ్‌ విభాగ నిర్మాణ పనులు పూర్తయితే 500 పడకలు నూతనంగా అందుబాటులోకి వస్తాయని తద్వారా ఆసుపత్రిపై భారం తగ్గి మరింత నాణ్యమైన వైద్య సేవలందించేందుకు దోహదపడుతుందన్నారు. కెఎస్‌పిఎల్‌ ఎండి కెవి రావును ప్రత్యేకంగా సత్కరించారు. కెఎస్‌పిఎల్‌ సీఈవో మురళీధర్‌, సీఎస్‌ఆర్‌ ఎంవో డాక్టర్‌ రాజ్‌కుమారి, అనస్తీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రసన్న, ఆర్థోప్రొఫెసర్‌ డాక్టర్‌ ముఖర్జీ ఉన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:31 PM