పేరు ఒకరిది.. పెత్తనం మరొకరిది..
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:04 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న ఇద్దరు రిసోర్స్‌పర్సన్లు (ఆర్పీలు) ఇటీవల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో రుణాలు కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కలెక్టర్ వద్దకు వెళ్లడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మెప్మా పీడీని ఆదేశించారు. ఇదేకాదు.. కొందరు ఆర్పీల స్థానంలో బినామీలు పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరు కీలకంగా చక్రం తిప్పినట్టుగా చెబుతున్నారు.
కాకినాడ నగరంలో బినామీ ఆర్పీలు 8 మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల పేరుతో కొందరు మోసాలు
ఇటీవల బోగస్ సంతకాలు చేసి దొరికేసిన ఆర్పీలు
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న ఇద్దరు రిసోర్స్‌పర్సన్లు (ఆర్పీలు) ఇటీవల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో రుణాలు కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కలెక్టర్ వద్దకు వెళ్లడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మెప్మా పీడీని ఆదేశించారు. ఇదేకాదు.. కొందరు ఆర్పీల స్థానంలో బినామీలు పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరు కీలకంగా చక్రం తిప్పినట్టుగా చెబుతున్నారు.
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటారు.. అచ్చం అలాంటిదే ఇది. పేరు ఒకరిది.. పెత్తనం మరొకరిదిలా తయారైంది కాకినాడ నగరంలోని ఆర్‌పీ(రిపోర్స్ పర్సన్)లది. డ్వాక్రా సంఘాల నిర్వహణలో వీరి విధులు ఎంతో కీలకమైనవి. మహిళా స్వయం సహాయక సంఘాల గ్రూపులను నడిపించడం, వాటి పుస్తకాల నిర్వహణ, అవి సక్రమంగా ఉన్నాయో, లేవో చూడడం, బ్యాంకు అధి కారులతో మాట్లాడడం, సంఘాలు పొదుపు సొమ్ము కడుతున్నారో లేదో తెలుసుకోవడం, రుణాలు ఇప్పించడం, వాటిని సంఘ సభ్యు లు సరిగా చెల్లిస్తున్నారో లేదో చూడడం, గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నాయో లేదో గమనించడం.. ఇలా ఎన్నో కార్యకలాపాలు చేపట్టాలి. ఇక రాజకీయ పార్టీల పెద్దలు, ఉన్నతాధికారులు చెప్పిన పనులు చేస్తుండాలి. అంతటి కీలకమైన ఈ ఆర్పీల్లో కొందరు ఏళ్ల తరబడి కాకినాడలో బినామీలుగా చెలామణీ అవుతున్నారు. వాస్తవానికి ఆర్పీ (రిసోర్స్‌పర్సన్)గా పనిచేయాలంటే కచ్చితంగా పదోతరగతి పాసవ్వాలి. ఒక ఆర్పీ 25 నుంచి 30 గ్రూపుల వరకు నిర్వహించే అవకాశం ఉంది. అంతకుమించి నిర్వహించకూడదనే నిబంధన కూడా ఉంది. అంతేకాదు ఒక్కో ఆర్పీ ఒక ఎస్‌ఎల్‌ఎఫ్ (స్లమ్ లెవెల్ ఫెడరేషన్) మాత్రమే ఉండాలి.
జరుగుతున్న ఇదీ..
కాకినాడ నగరంలోని పలు డివిజన్లలో కొన్నేళ్లుగా బినామీ రిసోర్స్ పర్సన్లు(ఆర్పీ)లు కొనసాగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహించారు. కొంత మంది అనర్హులు ఈ బినామీలుగా అవతారమె త్తి మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో చక్రం తిప్పుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఆన్‌లైన్‌లో ఆర్పీ పేరు ఒకటి ఉంటే.. అనధికారికంగా ఆఫ్‌లైన్‌లో వేరొక మహి ళ ఆర్పీగా చెలామణీలో ఉంటూ గ్రూపు కార్యకలాపాలు చక్కబెడుతుంటారు. ఇలా కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 40 మంది వరకు ఉంటారని సమాచారం. అలాగే ఆర్పీగా అధికారికంగా పేరున్న మహిళకు రావల్సిన జీతం సొమ్మును కూడా వీరే పొందుతున్నట్టుగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి అండతో ఈ బినామీలు చెలరేగిపోయారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించే సమయంలో ఆయా సంఘాల సభ్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున సొమ్ములు కూడా డిమాండ్ చేస్తున్నట్టు గా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. కొంత మంది అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి రుణాలు పెద్ద ఎత్తున తీసుకోవడం, వాటిపై అధికారులు విచారణ జరిపి, వారి లాగిన్‌లను క్లోజ్ చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఏళ్ల తరబడి సంఘాల నిర్వహణలో తలపండిన వీరు ఆన్‌లైన్‌లో పేరున్న ఆర్పీలకు మొండి చేయి చూపేలా వ్యవహరిస్తున్నారు. కాకినాడ నగరంలోని పలు డివిజన్లలో కొన్ని కుటుంబాలే పేటెంట్ హక్కుగా ఆర్పీ విధులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. కొత్త వారికి అవ కాశం ఉన్నా.. వారిని ఏమాత్రం రానివ్వడం లేదు. దీని వెనుక రాజకీయపరమైన ఒత్తిడులూ కారణమే. ఉదాహరణకు ఒక ఇంట్లో కోడలి పే రు ఆన్‌లైన్‌లో ఉంచి.. బయట మాత్రం అత్త ఆఫ్‌లైన్‌లో పెత్తనం చేస్తోంది. ఎలా ఎంతో మంది బినామీలుగా వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థ, మెప్మా అధికారులు ఈ బినామీ ఆర్పీల కబంధ హస్తాల ఉంచి మహిళాస్వయం సహాయ సంఘాలకు విముక్తి కలిగించి, సర్వీస్ రిజిస్టర్‌లో ఉన్న అసలైన ఆర్పీలకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.