Share News

ఆటోమేటిక్‌.. ఐడియా..

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:21 AM

ఈ పెద్దాయన బు ర్రకు పదునుపెట్టాడు. పెరుగుతున్న డీజిల్‌ ధరలతో బతుకు ‘బండి’ లాగడం కష్టమని భావించి ఇటీవల ఓ ఈ-ఆటోను కొనుగోలు చేశాడు. 8 గంటలు చార్జింగ్‌ పెడితే సు మారు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అయితే రోజుకు 8 గంటల పాటు బ్యాటరీకి చార్జింగ్‌ పెడితే కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోందని.. ఏం చేయాలని ఆలోచించసాగాడు. తన పొలంలో నీళ్లు తోడే మోటారుకు సోలార్‌ కనెక్షన్‌ ఉండడం చూసి.. అంత పెద్ద మోటారే సోలా

ఆటోమేటిక్‌.. ఐడియా..

ఆటోపై సోలార్‌ ప్యానెల్‌ బిగింపు

కాకినాడలో డ్రైవర్‌ వినూత్న ఆలోచన

ఈ పెద్దాయన బు ర్రకు పదునుపెట్టాడు. పెరుగుతున్న డీజిల్‌ ధరలతో బతుకు ‘బండి’ లాగడం కష్టమని భావించి ఇటీవల ఓ ఈ-ఆటోను కొనుగోలు చేశాడు. 8 గంటలు చార్జింగ్‌ పెడితే సు మారు వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అయితే రోజుకు 8 గంటల పాటు బ్యాటరీకి చార్జింగ్‌ పెడితే కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోందని.. ఏం చేయాలని ఆలోచించసాగాడు. తన పొలంలో నీళ్లు తోడే మోటారుకు సోలార్‌ కనెక్షన్‌ ఉండడం చూసి.. అంత పెద్ద మోటారే సోలార్‌తో పనిచేస్తున్నప్పుడు.. తన ఈ- ఆటోకు పనిచేయదా? అని ఆలోచించాడు. తన ఆలోచనను కాకినాడలోని అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలో ఉన్న ఓ సోలార్‌ టెక్నీషియన్‌కు తెలిపాడు. దీంతో 48 ఓల్ట్స్‌, 580 వాట్స్‌ ఉన్న సోలార్‌ పలకను ఆటోపై భాగాన బిగించాడు. సూర్యకాంతితో ఆటో రయ్‌.. రయ్‌ మని కాకినాడ వీధుల్లో తిరగడం ప్రారంభమైంది. ఇంతకీ ఈయన పేరు చెప్పలేదు కదూ.. భాస్కరరావు, ఊరు పెద్దపూడి మండలం అచ్యుతాపురత్రయం. కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ‘‘గతంలో నా ఈ-ఆటోకు గంటల తరబడి చార్జింగ్‌ పెడితే.. రూ.1500కు పైగా కరెంటు బిల్లు వచ్చేది. ఈ సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేయడంతో చార్జింగ్‌ పెద్దగా పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మా ఇంటి కరెంటు బిల్లు రూ.800 వరకు వస్తోంది. సోలార్‌ విద్యుత్‌ కాస్త డబ్బు ఆదా అవుతోంది.’’ అని పేర్కొన్నాడు.

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 11 , 2025 | 12:21 AM