Share News

ఇసుక లారీలను నియంత్రించాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:48 AM

ఎటపాక, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇసుక లారీలు నియంత్రించాలని, డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్ర మాదకర రీతిలో లారీలు నడుపుతున్నారని..వాటి రాక పోకలతో రహదారులు ధ్వంసవుతున్నాయని కన్నాయిగూ డెం వాసులు ఆందోళనబాట పట్టారు. అల్లూరి జిల్లా ఎట పాక మండలం రాష్ట్ర సరిహద్దులోని కన్నాయిగూడెం వద్ద గ్రామస్తులు భద్రాచలం- చర్ల అంతరాష్ట్ర రహదారిపై 2 రోజుల పాటు ఇసుక లారీలను

ఇసుక లారీలను నియంత్రించాలి
ఇసుక లారీలు నిలిపి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

కన్నాయిగూడెం వాసుల ఆందోళన

కదిలిన అధికారులు, ఎమ్మెల్యే తెల్లం

ఎటపాక, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇసుక లారీలు నియంత్రించాలని, డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్ర మాదకర రీతిలో లారీలు నడుపుతున్నారని..వాటి రాక పోకలతో రహదారులు ధ్వంసవుతున్నాయని కన్నాయిగూ డెం వాసులు ఆందోళనబాట పట్టారు. అల్లూరి జిల్లా ఎట పాక మండలం రాష్ట్ర సరిహద్దులోని కన్నాయిగూడెం వద్ద గ్రామస్తులు భద్రాచలం- చర్ల అంతరాష్ట్ర రహదారిపై 2 రోజుల పాటు ఇసుక లారీలను అడ్డుకున్నారు. దీంతో సరిహద్దులోని 2రాష్ట్రాల పరిధిలోని పోలీసులు, రెవెన్యూతోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కదిలారు. ఆయన మాట్లాడుతూ భద్రాచలం నుంచి చర్ల వరకు చేపట్టే రహదారి మరమ్మతుల పనుల్లో భాగంగా మధ్యలో తమ పరిధి (ఆంధ్ర)లో ఉన్న ఎటపాక నుంచి కన్నాయిగూడెం వరకు కూడా రహదారి మరమ్మతు లు చేయిస్తామని చెప్పారు. మరమ్మతులు పూర్త య్యేవరకు ఇసుక రావాణా చేయవద్దని తెలం గాణ లోని చర్ల, భద్రాచలం మండలాల తహశీల్దార్లను ఆ దేశించారు. మరోవైపు చింతూరు పీవో శుభం నోక్వా ల్‌ సైతం స్పందించారు. కన్నాయిగూడెం వాసులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆంరఽధ పరిధి వరకు రహదారి మరమ్మతులు చేస్తామని హామీఇచ్చారు. ఆందోళ నలతో సుమారు 10 కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోయాయి. తెలంగాణలోని దుమ్ముగూడెం మ ండలానికి చెందిన కొందరు ఇసుక లోడ్‌ లారీలను కన్నాయిగూడెంలో గ్రామస్తులు నిలుపుదల చేసిన విషయంపై అభ్యంతరం చెప్పడంతో ఎస్‌ఐ అప్పల రాజు, సీఐ కన్నపరాజు జోక్యం చేసుకున్నారు. పోలీసులు ఇసుక లారీలను పంపించివేయడంతో వివాదం సద్దుమనిగింది.

Updated Date - Oct 22 , 2025 | 12:48 AM