Share News

ఏడాదికే శిథిలావస్థకు..

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:07 AM

గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. వాటిలో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని 45వ డివిజన్‌ ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీలోని కమ్యూనిటీ హాలు ఒకటి. దానిని 2021లో రూ.1.05 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. అయితే ఆ హాలు చూస్తే పైభాగంలో రేకుల షెడ్డు మాదిరిగా ఉంది. అయితే ఏడాదికే పూర్తిగా పా డై వినియోగించుకోవడానికి వీలులేకుం డా మారింది.

ఏడాదికే శిథిలావస్థకు..
ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీ ప్రాంతంలో నిర్మించిన కమ్యూనిటీ హాలు

  • ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీలో కమ్యూనిటీహాలు దుస్థితి

  • కొంతకాలంగా నిరూపయోగం

  • రూ.1.05 కోట్లు వృథా

  • గత ప్రభుత్వ నిర్వాకం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14( ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. వాటిలో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని 45వ డివిజన్‌ ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీలోని కమ్యూనిటీ హాలు ఒకటి. దానిని 2021లో రూ.1.05 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. అయితే ఆ హాలు చూస్తే పైభాగంలో రేకుల షెడ్డు మాదిరిగా ఉంది. అయితే ఏడాదికే పూర్తిగా పా డై వినియోగించుకోవడానికి వీలులేకుం డా మారింది. దీంతో కొంత కాలంగా ఈ కమ్యూనిటీ హాలు మూతపడిం ది. నాశిరకం మెటిరీయల్‌ వి నియోగించడం వల్ల పాడైనట్టు తెలుస్తోంది. రూ.50 లక్షలతో చేసే దానికి గత ప్రభుత్వంలో కోటి ఖర్చుపెట్టినట్టు చూపించారు. ఈ హాలును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తే ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీతోపాటు ఇందిరా నగర్‌, లూధర్‌గిరి, సొసైటీ బిల్డింగ్‌ తదితర ప్రాంతాల ప్రజలకు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

  • రూ.35 లక్షలతో మరమ్మతులు

వాంబేకాలనీలో పూర్తిగా పాడైన కమ్యూనిటీ హాలును ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇటీవల పరిశీలించారు. హాలును స్థానికులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేపరు మిల్లు సీఎస్‌ఆర్‌ నిధులు రూ.35 లక్షలు కేటాయించి కమ్యూనిటీ హాలుకు మరమ్మతులు చేపట్టారు.

Updated Date - Dec 15 , 2025 | 01:07 AM