Share News

జంక్షన్లు జామ్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:08 AM

చారిత్రక రాజమహేంద్రవరంలోని ప్రజలను ట్రాఫిక్‌ తిప్పలు పెడుతోంది. జిల్లా కేంద్రంలోని కుచించుకుపోయిన కూడళ్లు వాహనాల రాకపోక లను ఇరుకున పెడుతున్నాయి. అభివృద్ధికి కోట్లా ది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తే సదుపాయా లు మెరుగున పడతాయని జనం అనుకొన్నారు. తీరా పనులు కాస్తా పూర్తయ్యాక ‘షో’కులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

జంక్షన్లు జామ్‌
లాలాచెరువు ప్రాంతంలో ట్రాఫిక్‌జామ్‌

  • నగరంలో రాకపోకలకు రోజూ పాట్లే

  • వైసీపీ హయాంలో ఆర్భాటపు పనులు

  • రాజమహేంద్రికి అనవసర ‘షో’కులు

  • కుచించుకుపోయిన కూడళ్లు

  • వాహనదారుల అవస్థలు

  • సరిదిద్దడంలో పాలకుల తాత్సారం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

చారిత్రక రాజమహేంద్రవరంలోని ప్రజలను ట్రాఫిక్‌ తిప్పలు పెడుతోంది. జిల్లా కేంద్రంలోని కుచించుకుపోయిన కూడళ్లు వాహనాల రాకపోక లను ఇరుకున పెడుతున్నాయి. అభివృద్ధికి కోట్లా ది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తే సదుపాయా లు మెరుగున పడతాయని జనం అనుకొన్నారు. తీరా పనులు కాస్తా పూర్తయ్యాక ‘షో’కులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేస్తే ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. కానీ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ప్రయాణానికి మాత్రం యాతన పెరిగిపోయింది.

  • నగరంలో ఇదో వింత

రాజమహేంద్రవరం నగరం వాణిజ్య, వైద్య, విద్య, రవాణాపరంగా ఇటు కోనసీమ, అటు ఏజె న్సీ, కాకినాడ ప్రాంతాలకు రాజధానిగా చెప్పవ చ్చు. కొన్నేళ్లుగా ఆవాసాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతే స్పీడుతో కొత్త వాహనా లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లు, కూడళ్లను అభివృద్ధి చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఆ ప్లాను, ఈ ప్లాను అంటూ ఎవరికి ఇష్టం వచ్చిన ట్లు వాళ్లు ఒక సహేతుక, శాస్త్రీయ పద్ధతులు లేకుండా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని అభివృద్ధి పేరుతో నగరంలో పోశారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ తతంగం యథేచ్చగా సాగింది. ఆ ముసుగులో అధిక మొత్తాలను అప్పటి వైసీపీ తెరచాటు కాంట్రాక్టర్లు, ఆనాటి ప్రజాప్రతినిధులు మింగేశారు. అవసరమైన అభి వృద్ధిని మరుగున పడేసి అనవసరపు ‘షో’కుల ను నగరానికి అద్దారు. ప్రధానంగా రాజమహేం ద్రవరంలోని కూడళ్లు ట్రాఫిక్‌ చోకింగ్‌ పాయిం ట్లుగా మారిపోయాయి. ముఖ్య కూడళ్లలో పరి స్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలోకి అటు కోటిపల్లి బస్టాండ్‌, ఇటు లాలాచెరువు, క్వారీ మార్కెట్‌ సెంటర్‌ లేదా హైవే నుంచి ప్రవేశించి నా నగరంలోకి వచ్చే సరికి ట్రాఫిక్‌ ముప్పుతిప్ప లు పెడుతోంది. కోటిపల్లి బస్టాండ్‌, శ్యామలా సెంటర్‌, తాడితోట జంక్షన్‌, ఆర్టీసీ కాంపెక్స్‌ వద్ద, వెంకటేశ్వరా మార్కెట్‌ జంక్షన్‌, ఐఎల్‌టీడీ జం క్షన్‌, బైపాస్‌ రోడ్డు కూడళ్లలో రద్దీ సమయాల్లో వాహనదారులకు యాతన తప్పడం లేదు.పుష్క రఘాట్‌, దేవీచౌక్‌ సెంటర్లలోనూ అదే పరిస్థితి. జాంపేట, దేవీచౌక్‌ సమీపంలోని గాంధీ విగ్ర హం, ఇన్‌కంట్యాక్స్‌ కార్యాలయం కూడలిలో వా హనాలను నడపడం డ్రైవర్లకు పరీక్షగా మారిం ది. ఆర్టీసీ డ్రైవర్ల ఇబ్బంది అంతా ఇంతా కాదు. లాలాచెరువు, క్వారీ మార్కెట్‌కి వెళ్లే సెంటర్‌, కం బాల చెరువు పార్కు ఏరియాల్లో ప్రమాదాలు కోరలు చాచుకున్నాయి. విగ్రహాలను చూస్తూ మురిసిపోవాలో, అనాలోచిత నిర్ణయాలను తిట్టు కోవాలో జనాలకు అర్థం కాని పరిస్థితి. దీనికితో డు సరైన పార్కింగ్‌ ఏర్పా ట్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఎక్కడ పడి తే అక్కడ నిలిపేయడం తప్పడం లేదు.

  • పుష్కరాలకు పాట్లే

ఎంత ఓర్పుతో వాహనం నడిపే వారికైనా విసుగు, వాహనాలకు గీతలు తప్పడం లేదు. సాయంత్రం.. ఉదయం వేళల్లో జంక్షన్లు జామ్‌ అవుతున్నాయి.హారన్ల మోత మోగుతోంది. ఇదం తా ఏడాదిగా చూస్తున్న ప్రస్తుత పాలకులు సరి దిద్దే పనికి ఇంకా అడుగు వేయకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత పుష్కరాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సీఎం చంద్రబాబు స్వయంగా పనుల ను పర్యవేక్షించారు.ఆ సమయంలో రోడ్లను వెడ ల్పు చేశారు. దీంతో రోజుకు సుమారు 5లక్షల మంది యాత్రికులు వచ్చినా పెద్దగా ఇబ్బంది కలగలేదు. మళ్లీ పుష్కరాలు 2027లో నిర్వహిం చనున్నారు. ఈసారి రోజుకు 10 లక్షలకుపైగా జనమొచ్చే అవకాశం ఉందనే అంచనాలు న్నా యి. వాహనాలు కూడా భారీ సంఖ్యలోనే నగ రంలో రాకపోకలు సాగిస్తాయి. అయితే ఇప్పటి పరిస్థితిలో మార్పు రాకుంటే.. ముఖ్యంగా కూడ ళ్లను వెడల్పు చేయకపోతే నరకం తప్పకపోవ చ్చు. పుష్కరాలకు దగ్గరలో నిధులు రాబట్టి హ డావుడి పనులతో సరిపెట్టకుండా.. కాస్త ముందు గానే ప్రభుత్వం నుంచి సొమ్ములు తెచ్చుకొని శాశ్వతంగా సమస్యలకు చెక్‌ పెట్టాలని పాలకు లకు నగర పౌరులు సూచిస్తున్నారు. లాలాచెరు వు జంక్షన్‌, పుష్కరఘాట్‌, దేవీచౌక్‌, ఇన్‌కంట్యాక్స్‌ కార్యాలయ ప్రాంతం, కంబాల చెరువు పార్కు తదితర ప్రాంతాలపై దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Aug 05 , 2025 | 01:08 AM