Share News

విద్య విజయం

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:16 AM

యువత ధైర్యంగా, విభిన్నంగా ఆలోచిస్తూ సమస్యలను ఎదుర్కొని విజయం సాధించాలని రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీ కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు.

విద్య విజయం
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో జేఎనటీయూకే వీసీ తదితరులు

క్వాంటమ్‌ మిషన్‌తో ఉపాధి

గవర్నర్‌, వర్సిటీ కులపతి అబ్దుల్‌ నజీర్‌

జేఎన్‌టీయూకే 11వ స్నాతకోత్సవం

జేఎన్టీయూకే, జూలై4(ఆంధ్రజ్యోతి): యువత ధైర్యంగా, విభిన్నంగా ఆలోచిస్తూ సమస్యలను ఎదుర్కొని విజయం సాధించాలని రాష్ట్ర గవర్నర్‌, వర్సిటీ కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.వర్సిటీలోని అలూమ్నీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. విద్య అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైందని, విద్యతో ప్రపంచంలో దేన్నయినా సాధించవచ్చన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న క్వాంటమ్‌ మిషన్‌ వల్ల 2026 నాటికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ, ఏఐ, ఐవోటీ, రోబోటిక్స్‌, నానోటెక్నాలజీ, తాత్విక ఆలోచనలతో సాంకేతికతను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌-2027 విజన్‌ ద్వారా మన రాష్ట్రం డిజిటల్‌ పరిపాలన, స్టార్టప్స్‌, తీరప్రాంతాల ఆధునికీకరణతో ప్రపంచాన్ని తలదన్నే మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకువెళుతుందని చెప్పారు.ఇక్కడే చదువుకుని..అమెరికాలోని బోస్టన్‌ గ్రూప్‌ చైర్మన్‌గా ఉన్న కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట) కు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం కోట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్టార్టప్స్‌ కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషన్‌ సెల్స్‌ విశిష్టతను తెలిపారు. భారతదేశంలో ప్రతీ ఏడాది 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 3.5 లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారన్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో గ్రాడ్యుయేట్లు 1.5 రెట్లు ఎక్కువని, అమెరికాతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువని తెలిపారు. భారతదేశంలో విద్యా నాణ్యత ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్‌ఈలో భారత్‌లో ప్రతి ఏడాది సుమారుగా 25 మంది మాత్రమే పీహెచ్‌డీలు అందుకుంటున్నారని, అమెరికాలో ఏడాదికి 800 మంది కంటే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. జేఎన్టీయూకే ఉపకులపతి సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ మాట్లాడుతూ పరిశోధన కోసం నూతన కోణాలను అవలంభించాలని, సమాజశ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలతో పాటు పరిశ్రమల్లో పరిశోధనలను జాతీయ విద్యావిధానం ప్రోత్సహిస్తుందన్నారు. తర్వాత గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ను వీసీ సత్కరించారు. వర్సిటీ రెక్టార్‌ కేవీ రమణ స్నాతకోత్సవానికి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వర్సిటీ రిజిసా్ట్రర్‌ రవీంద్రనాఽథ్‌, రాజ్‌ భవన్‌ అధికారులు, ఆదిత్య చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌, మాజీ వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, కేవీఎస్‌జీ మురళీకృష్ణ, శ్రీనివాస్‌కుమార్‌, ఈసీ సభ్యులు బీవీవీ సత్యనారాయణ, అమీనాభి, హరిత, రత్నకుమారి, డైరెక్టర్లు గోపాలకృష్ణ, బీటీకృష్ణ, కృష్ణప్రసాద్‌, పద్మజారాణి, ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు, శ్యామ్‌కుమార్‌, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

99 మందికి పీహెచడీ అవార్డులు

స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా 99 మంది రీసెర్చ్‌ స్కాలర్స్‌ కు పీహెచ్‌డీ అవార్డులు, 35 మందికి బంగారు పతకాలు, ఐదుగురికి ఎండోమెంట్‌ అవార్డులను గవర్నర్‌, వీసీ ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వర్సిటీ రిజిసా్ట్రర్‌ రవీంద్రనాఽథ్‌, ఆదిత్య చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌, మాజీ వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, కేవీఎస్‌జీ మురళీకృష్ణ, శ్రీనివాస్‌కుమార్‌, ఈసీ సభ్యులు బీవీవీ సత్యనారాయణ, అమీనాభి, హరిత, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 01:16 AM