జిందాల్‌కు జై!
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:32 AM
ఉమ్మడి జిల్లాలో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్త నుంచి విద్యుత్ తయారుచేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతూ ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న చెత్త ఇకపై కనిపించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్నంతా ఒకేచోటకు చేర్చి దాని నుంచి విద్యుత తయారుచేయడానికి ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేసింది.
జిందాల్ చేతికి రూ.370 కోట్ల చెత్త నుంచి విద్యుత తయారీ ప్లాంట్
టెండర్లలో వర్క్ ఆర్డరు దక్కించుకున్న కంపెనీ
రెండు దశల్లో మొత్తం రూ.1270 కోట్ల పెట్టుబడికి నిర్ణయం
ఎట్టకేలకు పెద్దాపురం రామేశంమెట్ట అనుకూలంగా ఉండడంతో ఖరారు
అంతకుముందు కాకినాడ,పిఠాపురంతోపాటు ఏడుచోట్ల స్థలాల పరిశీలన
ఉమ్మడి తూ.గో. జిల్లాలో చెత్తంతా ఒకేచోటకు తరలించి 12 మెగావాట్ల విద్యుత తయారీ
ఉమ్మడి జిల్లాలో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్త నుంచి విద్యుత్ తయారుచేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతూ ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న చెత్త ఇకపై కనిపించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్నంతా ఒకేచోటకు చేర్చి దాని నుంచి విద్యుత తయారుచేయడానికి ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేసింది. పోటీలో ప్రముఖ జిందాల్ సంస్థ ప్రాజెక్టు దక్కించుకుంది. పెద్దాపురం మండలం రామేశంమెట్టలో 35 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేయడానికి కంపెనీ తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దశల్లో మొత్తం రూ.1270 కోట్ల పెట్టుబడిని జిందాల్ సంస్థ పెట్టబోతోంది. తొలి దశలో రూ.370 కోట్లతో చెత్త నుంచి రోజుకు 12 మెగావాట్ల విద్యుత తయారుచేయనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును అనపర్తి నియో జకవర్గం బలభద్రపురంలో ఏర్పాటు చేయాలని భావించినా కుదరలేదు. చివరకు రామేశంమెట్ట ఖరారైంది
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పం చాయతీలు కలిపి 11 వరకు ఉన్నాయి. వీటి పరిధి లో రోజూ భారీగా చెత్త పోగవుతోంది. నిత్యం ఈ చెత్తంతా మున్సిపల్ సిబ్బంది నగరాలు, పట్టణాల కు దూరంగా డంపింగ్ యార్డులకు తరలిస్తున్నా రు. ఇందుకోసం వందలకొద్దీ వాహనాలు, ఉద్యోగు లు అవసరమవుతున్నారు. ఇలా ఏళ్ల తరబడి పోగ వుతున్న చెత్తతో ఆయా ప్రాంతాల డంపింగ్ యా ర్డులు కొండలను తలపిస్తున్నాయి. వీటికి నిప్పం టిస్తుండడంతో తీవ్ర వాయుకాలుష్యం వెలువడు తోంది. అటు తీవ్రమైన దుర్వాసనతో జనం ఇబ్బం దులు పడుతున్నారు. దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో వీటన్నింటికి విరుగుడుగా ఈ చెత్తనంతటిని మం డించి విద్యుదుత్పత్తి చేపట్టేలా ప్రాజెక్టుకు రూప కల్పన చేసింది. అందులో భాగంగా చెత్త నుంచి విద్యుత తయారీ ప్రాజెక్టును రూ.370 కోట్లతో పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 మున్సిపాల్టీల తోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మరో 11 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను కలిపి కాకినాడ- రాజమహేంద్రవరం క్లస్టర్‌గా ప్రభుత్వం ప్రతిపా దించింది. ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమతో కలి పి రోజుకు 950 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్న ట్టు లెక్కలు కట్టింది. ఇందులో అత్యధికంగా ఉమ్మ డి తూర్పు పరిధిలోని కాకినాడ కార్పొరేషనలో రోజుకు 144 టన్నులు, రాజమహేంద్రవరం కార్పొ రేషన 160, పిఠాపురం 26, పెద్దాపురం 25, సామ ర్లకోట 23, రామచంద్రపురం 23, మండపేట 26, ముమ్మిడివరం 11, అమలాపురం మున్సిపాల్టీ పరి ధిలో 30 టన్నుల చొప్పున చెత్త రోజువారీ వస్తోం ది. ఈ చెత్తంతటిని ఒకచోటకు చేర్చి దీనితో విద్యు దుత్పత్తి చేయడానికి అధికారులు అంచనా వేయ గా, రోజుకు 12మెగావాట్ల వరకు విద్యుతను ఉత్ప త్తి చేయవచ్చని తేల్చారు. 12మెగావాట్ల విద్యుత ఉత్పత్తి ప్లాంట్‌కు రూ.370 కోట్ల వరకు ఖర్చవు తుండగా, ఒక్క పైసా కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా ప్రైవేటు కంపెనీయే భరించేలా ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం చెత్త నుం చి విద్యుత ఉత్పత్తి చేసే కంపెనీయే ఈ మొత్తం భరించేలా టెండర్లు పిలిచింది. ఎంపికైన సంస్థ ఈ మొత్తం భరిస్తే ప్రభుత్వం తరఫున చెత్త ఇవ్వడం, ఉత్పత్తయిన విద్యుతను 25ఏళ్లపాటు సదరు కం పెనీయే సొంతంగా విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఏమాత్రం భారం లేకుండా రెండు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాల్టీల్లో చెత్తంతా బయటకు వెళ్లిపో నుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు పిలిచిన టెండర్లలో పలు కంపెనీలు పోటీపడగా, ప్రముఖ జిందాల్ కంపెనీ వర్కు ఆర్డరు సొంతం చేసుకుం ది. దీంతో ప్రభుత్వం ఈ సంస్థతో ఇటీవల ఒప్పం దం ఖరారు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కావలసి ఉండడంతో దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే జిందాల్ గుంటూ రులో చెత్త నుంచి విద్యుత తయారుచేస్తోంది.
అన్నీ చూసి.. రామేశంమెట్ట ఓకే చేసి..
ఈ ప్రాజెక్టుకు అనువైన ప్రదేశం కోసం పలు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు తొలుత అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో 12, బలభద్ర పురంలో 20ఎకరాలు ఎంపిక చేశారు. 12 ఎకరాల్లో విద్యుతప్లాంట్, 20ఎకరాల్లో తెచ్చిన చెత్త, ఫ్లైయాష్ పోగుచేసేలా ప్రతిపాదించారు. తద్వారా చెత్త నుం చి తయారయ్యే విద్యుతను గ్రిడ్‌కు అనుసంధానిం చేలా విద్యుత లైన ఉండడంతో ప్రాజెక్టు ఖరారు చేశారు. తీరా దీనిపై స్థానిక ప్రజలు, అటు అన పర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ప్రత్యామ్నాయంగా కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, పిఠాపురం చెందు ర్తితోపాటు మరో ఏడుచోట్ల అధికారులు పరిశీలిం చారు. పెద్దాపురం రామేశంమెట్ట అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతం జనావాసాలకు దూరంగా ఉండడం, పైగా ఈ ప్రాంతం ఏడీబీ రహదారిని అనుకుని ఉండడంతో చెత్త వాహనాల రాకపోకలకు అనువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రాజప్ప సైతం ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖంగా ఉండడంతో ఎట్టకేలకు రామేశంమెట్టను ఖరారు చేశారు. జిందాల్ సంస్థ సైతం ఇక్కడ ప్రాజెక్టుకు అనుకూలత ఉండడంతో 35 ఎకరాలు కోరింది. దీం తో కొన్ని రోజుల కింద ఆ కంపెనీకి 16 ఎకరాల ప్రభుత్వ భూములు అప్పగించారు. మరో 19 ఎక రాలు చెత్తనిల్వ, ఫ్లైయాష్ నిల్వకు అవసరం ఉండ డంతో సమీపంలో ఉన్న డీపట్టా భూములు గుర్తిం చారు. రైతులకు ఎకరాకు రూ.19 లక్షల వరకు ఇచ్చేలా చర్చలు జరుపుతున్నారు. తొలివిడత ప్రా జెక్టు పూర్తయ్యాక మలివిడత ఈ ప్రాజెక్టుపై జిం దాల్ మరో రూ.900 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.