Share News

రేపు జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా 216హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:03 AM

పిఠాపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ శివారులో ఎస్‌బీ వెంచర్స్‌ ఆవరణలో ఈనెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభను దృష్టిలో ఉంచు కుని శుక్రవారం కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఆ రోజు ఉదయం 11 నుం

రేపు జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా 216హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు
పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు మనోహర్‌, దుర్గేష్‌

పిఠాపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ శివారులో ఎస్‌బీ వెంచర్స్‌ ఆవరణలో ఈనెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభను దృష్టిలో ఉంచు కుని శుక్రవారం కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఆ రోజు ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వ రకూ కార్యక్రమాలు జరగనుండటం, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తదితరులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఆ రోజు ట్రాఫిక్‌ మళ్లింపు చేపడుతున్నట్టు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ బుధవారం తెలిపారు. సభ వద్ద ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలను జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌, మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు.

సభకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

మంత్రులు మనోహర్‌, దుర్గేష్‌

జనసేన ఆవిర్భావ సభకు వచ్చేవారికి ఎటు వంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌ ఆవరణలో 14న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్మోహన్‌, ఎస్పీ బిందుమాధవ్‌లతో కలిసి వారు బుధవారం రాత్రి పరిశీలించారు. హెలిప్యా డ్‌, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లుపై ఆరా తీశారు. సభకు వచ్చేవారు నేరుగా సభా ప్రాంగణంలోని వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారి వెంట కాకినాడ ఏఎస్పీ దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత, జనసేన నేతలు, ప్రజాప్రతినిఽదులు, అధికారులు ఉన్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా...

కాకినాడ, కోనసీమ జిల్లాలు నుంచి విశాఖపట్టణం(వయా కత్తిపూడి) వెళ్లే వాహనాలు కాకినాడ-ఇంద్రపాలెం వంతెన, కెనాల్‌ రోడ్డు, సామర్లకోట, కిర్లంపూడి, ప్రత్తిపాడు మీదుగా ఎన్‌హెచ్‌-16కి మళ్లిస్తారు

విశాఖపట్టణం నుంచి కాకినాడ, కోనసీమ జిల్లాలుకు వచ్చే వాహనాలు కత్తిపూడి నుంచి ప్రత్తిపాడు, కిర్లంపూడి, సామర్లకోట, కాకినాడ(కెనాల్‌రోడ్డు)మీదుగా మళ్లిస్తారు.

విశాఖపట్టణం-చెన్నై మధ్య కాకినాడ జిల్లా మీదుగా ఎన్‌హెచ్‌-16పై ప్రయాణించే వాహనాలు యధావిధిగా వెళ్లవచ్చు

వాహనాల పార్కింగ్‌కు 9 ప్రదేశాలు

వివిధ ప్రాంతాల నుంచి సభకు తరలివచ్చేవారి వాహనాల పార్కింగ్‌ కోసం చిత్రాడ పరిసర ప్రాంతాల్లో 9ప్రాంతాలను గుర్తించారు. కాకినాడ వైపు అయిదు, పిఠాపురం వైపు నాలుగు పార్కింగ్‌ ప్లేసులు ఏర్పాటు చేశారు.

పార్కింగ్‌ స్థలాలకు ఇలా వెళ్లాలి

పార్కింగ్‌ ప్రదేశాలు 1(ఏ,బీ,సీ,డీ,ఈ)లకు గుంటూరు జిల్లా, తెనాలి, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ తదితర జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఉప్పల ంక బైపాస్‌, చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్‌రోడ్డు, సామర్లకోట, 3 లైట్ల జంక్షన్‌, ముత్తా గోపాలకృష్ణ ఆర్వోబీ, సర్పవరం, అచ్చంపేట జంక్షన్‌ మీదుగా చిత్రాడ సభాస్థలానికి చేరుకోవాలి.

పార్కింగ్‌ ప్రదేశాలు 2(ఏబీసీడీ)లకు ఉత్తర కోస్తా జిల్లాలు విశాఖ, అనకాపల్లి, ఏఎస్‌ఆర్‌ తదితర జిల్లాల నుంచి కత్తిపూడి, పిఠాపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల నుంచి వాహనాలు ఏడీబీ రోడ్డు, రాజానగరం, రంగంపేట, సామర్లకోట, పిఠాపు రం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

Updated Date - Mar 13 , 2025 | 01:03 AM