మీ ప్రేమకు అభివందనం!
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:43 AM
ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం.. నూరు శాతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తు న్నామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. గడచిన పది నెలల్లో పిఠాపురం నియోజకవ ర్గంలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
10 నెలలు.. పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి
మాట నిలబెట్టుకుంటున్నాం
పిఠాపురం అభివృద్ధి చేస్తున్నాం
ఆర్వోబీ పనులకు టెండర్లు
శాంతిభద్రతలపై రాజీ లేదు
తప్పుచేస్తే ఉపేక్షించం
పెద్దాసుపత్రికి శంకుస్థాపన
అంతా కలిసి పనిచేస్తాం
పవన్ సుడిగాలి పర్యటన
(కాకినాడ/పిఠాపురం-ఆంధ్రజ్యోతి)
ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం.. నూరు శాతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తు న్నామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. గడచిన పది నెలల్లో పిఠాపురం నియోజకవ ర్గంలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తద్వారా 25 వేల మందికి పని కల్పించామని తెలిపారు. మూడు లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పిఠాపురం ఆర్వోబీ నిర్మాణానికి కేం ద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అనుమతిచ్చారని త్వరలోనే టెం డర్ల ప్రక్రియ మొదలవుతుంద ని ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రైల్వే మం త్రితో మాట్లాడగా ఆర్వోబీ నిర్మాణానికి నిధులివ్వడానికి అంగీకరించారన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నేతలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్ర సక్తి లేదని పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. క్రిమినల్స్, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పవన్‌కల్యాణ్ ఉదయం 9.30 గంటలకు పిఠాపు రం చేరుకోవాల్సి ఉండగా మూడు గంటల ఆల స్యంగా 12.27 గంటలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు, జిల్లా అధికారులు స్వా గతం పలికారు. అయితే నాయకులు హెలికాఫ్ట ర్ వద్దకు రాగా పైలట్ వారిని వెనక్కు వెళ్లాలని కాస్త విసురుగా చెప్పారు. ఇది చూసిన పవన్ నేతలను హెలీకాఫ్టర్ వద్దకు రమ్మని, పైలట్ వైపు చూస్తూ నేతలను ఏమీ అనవద్దని సూచించారు. పవన్ రోడ్డు మార్గాన పిఠాపురం వస్తూ యండపల్లి, కొండెవరం, నవఖండ్రవాడ తదితర గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న వారిని చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు. పిఠాపురం అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో మహిళల ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. రైతులకు టార్ఫాలిన్లు, స్ర్పేయర్లు, రోటావేటర్లు, కిసాన్ డ్రోన్ పంపిణీ చేశారు.ముస్లింలు, మహిళలను కలిశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, డ్రెయిన్లు, బీటీ రోడ్లు, గోకులాలును ప్రారంభించారు.అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ అరగంటకు పైగా కార్‌వ్యాన్‌లో ఉండిపోయి అనంత రం హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం విమానాశ్రయం, అక్కడ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ రూ రల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్‌ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, జేసీ రాహుల్ మీనా,జిల్లా ఎస్పీ బిందుమాధవ్, పాడా పీడీ చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ఇలా..
పిఠాపురం నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో రూ.18.02 కోట్లతో 31.59 కి.మీల మేర 276 సిమెంట్ రోడ్లు నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించామని పవన్‌కల్యాణ్ అన్నారు. 5.21 కి.మీల పొడవునా ఏడు తారురోడ్లను రూ.3.20 కోట్లతో పూర్తి చేశామని, వీటి ద్వారా 300 మంది కాం ట్రాక్టర్లకు, 5 వేల మంది శ్రామికులకు పనిక ల్పించామన్నారు. 434 గోదాంలతోపాటు వివిధ పనుల నిమిత్తం రూ.8.68 కోట్లు వ్యయం చేశామన్నారు. మరో రూ.21.58 కోట్లతో చేపట్టిన పనులు మరో మూడు నెలల్లో పూర్తవనున్నాయన్నారు. కొత్తపల్లిలో రూ.2 కోట్లతో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. 225 ఏళ్ల చరిత్ర కలిగిన గొల్లప్రోలు సీతారామస్వామి దేవస్థానంలో రూ.1.32 కోట్లతో ప్రాకార మండపం నిర్మిస్తున్నామన్నారు. చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానంలో కాలక్షేప మంటపం, రథశాల నిర్మిస్తున్నామని, మహిళలకు ఉచిత దర్జీ శిక్షణ ఇచ్చి 3,456 కుట్టుమిషన్లు ఉచితం గా అందజేస్తామన్నారు. రైతులకు రూ.26లక్షల వ్యయంతో రెండు వేల టార్ఫాలిన్లు అందజే స్తామని, రూ.1.94 కోట్లు వ్యయంతో 14 రోటోవీటర్లు, 39 పవర్‌టిల్లర్లు, 50 స్ర్పేయర్లు, కిసాన్ డ్రోన్లను రైతులకు అందజేస్తున్నట్టు చెప్పా రు. దీనివల్ల 25 వేల ఎకరాల పంటకు ప్ర యోజనం కలుగుతుందన్నారు.
పిఠాపురం సీహెచ్‌సీని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ వైద్యాధికారులతో మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణం ఏ విధంగ ఉండబోతోందో అధికారులు ప్రజంటేషన్ ఇస్తుండగా.. ఆసుపత్రి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పిఠాపురం బిడ్డ పవన్ అని కొందరు నినదించగా నవ్వుకుంటూ ముందుకు సాగారు.
పోలీసులు వర్సెస్ వర్మ
పిఠాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాలు వద్ద పోలీసులకు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. వర్మతోపాటు వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు లోపలకు అను మతించలేదు. దీనిపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అనుమతించకపోతే తాను వెళ్లిపోతానని వర్మ హెచ్చరించడంతో ఎస్పీ బిందుమాధవ్ సముదాయించారు.
నిధుల విడుదల ఇలా..
పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో తాగునీరు, మురుగునీటి వ్యవస్థ మెరుగుదల, ఇతర పనుల నిమిత్తం ప్రత్యేక గ్రాంటుగా మునిసిపల్‌శాఖా మంత్రి నారాయణ రూ.4 కోట్లు మంజూరు చేశారని పవన్ చెప్పారు. వీటితో త్వరలోనే పనులు చేపడతామన్నారు. పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో ఓహెచ్‌ఎస్‌ఆర్, పైప్‌లైన్ల మరమ్మతులు, ము రుగునీటి నిర్వహణకు కాకినాడ ఎంపీ నిధు లు నుంచి రూ.50 లక్షలు, హౌసింగ్ నుంచి రూ.50 లక్షలు కేటాయించినట్టు చెప్పారు.