Share News

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లి వస్తూ గుండెపోటుతో జనసైనికుడి మృతి

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:39 AM

అమలాపురం రూరల్‌, మార్చి 15 (ఆం ధ్రజ్యోతి): జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అడపా దుర్గాప్రసాద్‌ (42) అలియాస్‌ చిన్నా గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. శనివారం సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మృతుని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠా

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లి వస్తూ గుండెపోటుతో జనసైనికుడి మృతి
పవన్‌ ఆదేశాలతో దుర్గాప్రసాద్‌ తల్లి పార్వతికి రూ.2 లక్షలు నగదును అందజేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

అమలాపురం రూరల్‌, మార్చి 15 (ఆం ధ్రజ్యోతి): జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అడపా దుర్గాప్రసాద్‌ (42) అలియాస్‌ చిన్నా గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. శనివారం సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మృతుని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాటుచేసిన బస్సులో గ్రామం నుంచి దుర్గాప్రసాద్‌ వెళ్లాడు. అనంతరం రాత్రి చిత్రాడ నుంచి బస్సులో సహచరులతో కలిసి బయలుదేరారు. బస్సులో గండెపోటుతో మరణించాడు. తెల్లవారుజామున దుర్గాప్రసాద్‌ మృతదేహాన్ని స్వగ్రామమైన ఈదరపల్లి గ్రామానికి తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న జనసైనికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతుడికి తల్లి పార్వతితో పాటు సోదరుడున్నారు. తల్లి గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన ఉంది.

దుర్గాప్రసాద్‌ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్‌కల్యాణ్‌

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం చెందారని తెలిసి చింతిస్తున్నానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. దుర్గాప్రసాద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. జనసేన శాసనమండలి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్‌ సూచనల మేరకు అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు సీనియర్‌ నేత నల్లా శ్రీధర్‌ ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50వేలు అందించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్‌, నాయకులు దుర్గాప్రసాద్‌ ఇంటికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రూ2.లక్షలు ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందించగా ఆ మొత్తాన్ని వారు అందజేశారు.

Updated Date - Mar 16 , 2025 | 12:39 AM