కోర్టులో హాజరైన జనసేన నేతలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:01 AM
కాకినాడ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మె ల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మెన్ తుమ్మల బాబుతో పాటు జనసేన నాయ
కాకినాడ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మె ల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మెన్ తుమ్మల బాబుతో పాటు జనసేన నాయకులు బుధవారం కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో వాయిదాకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి కూడలిలో జనసేన నా యకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేసి కో ర్టులో హాజరుపర్చారు. అప్పటి నుంచి జనసేన నేతలు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. అందులో భాగంగా బుధవారం కోర్టుకు హాజరయ్యారు.