Share News

డిప్యూటీ సీఎం పవన్‌పై సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ పోస్టులు

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:20 AM

పిఠాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మా ధ్యమాల్లో మార్ఫింగ్‌ పోస్టులు పెట్టిన వారిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ మణికుమార్‌కు ఫి

డిప్యూటీ సీఎం పవన్‌పై సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ పోస్టులు
పిఠాపురం పట్టణ ఎస్‌ఐ మణికుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న జనసేన నేతలు

జనసేన నేతల ఆగ్రహం

పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు

పిఠాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మా ధ్యమాల్లో మార్ఫింగ్‌ పోస్టులు పెట్టిన వారిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ మణికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాండమ్‌ ఫారెస్ట్‌ తో పాటు పలు సామాజిక మాధ్యమ ఖాతాల్లో పవన్‌కల్యాణ్‌ స్థానంలో మార్ఫింగ్‌ చేసి కుక్క ఫొటో పెట్టారని, వైజాగ్‌లో యోగా చేస్తూ రిలా క్స్‌ అవుతున్న డీసీఎం అంటూ అవమానకర, అనుచిత రీతిలో పోస్టులు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. డిప్యూటీ సీఎం ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసిన సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వాహకులు, వా రి వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అవహేళన చేస్తున్నట్టు ఈ పోస్టులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో జనసేన నేతలు చెల్లుబోయిన సతీష్‌కుమార్‌, దానం లా జర్‌బాబు, బాలిపల్లి రాంబాబు, మాదేపల్లి శ్రీను, ఆగంటి ప్రభాకరరావు, బాలిపల్లి అనిల్‌, కొండేపూడి శివ, పల్నాటి మధు, వేల్పుల చక్రధర్‌, పోలిశెట్టి చంద్రశేఖర్‌,చక్కపల్లి వినయ్‌ ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:20 AM