రోడ్డు ప్రమాదంలో జనసేన నాయకుడు మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:14 AM
పి.గన్నవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముంగండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిమ్ నిర్వహకుడు, జనసేన నాయకుడు కత్తుల శ్రీనివాసరావు(35) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వై.కొత్తపల్లి గ్రామా నికి చెందిన జనసేన నాయకుడు శ్రీ
పి.గన్నవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముంగండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిమ్ నిర్వహకుడు, జనసేన నాయకుడు కత్తుల శ్రీనివాసరావు(35) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వై.కొత్తపల్లి గ్రామా నికి చెందిన జనసేన నాయకుడు శ్రీనివాసరావు గత కొంతకాలంగా పోతవరంలో జిమ్ నిర్వహి స్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వై.కొత్తపల్లి వెళ్తుండగా మార్గం మధ్యలో ముం గండ ముత్యాలమ్మ గుడి సమీపం లోకి వెళ్లే సరికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి సమీపం లో ఉన్న గోడను ఢీకొన్నా డు. దీంతో తలతో పాటు శరీరభాగా లకు బలమైన గాయాలు కావడంతో అంబాజీ పేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహామేరకు వైద్యం నిమిత్తం కాకినాడ తరలించడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి శ్రీను మృతిచెందాడు. ఆయ నకు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. శ్రీను అకాలమరణంతో వై.కొత్తపల్లిలో విషాధ చాయ లు అలుముకున్నాయి. మృతదేహాన్ని అమ లాపు రం ప్రభుత్వాసుప త్రికి తరలించి కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.శివకృష్ణ తెలి పారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీను పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.