Share News

వి..జయకేతనం!

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:34 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా జనసేన పార్టీ జయకేతన సభకు సర్వసన్నాహాలు చేస్తోంది. పిఠాపురం కేంద్రంగా పార్టీ 12వ రాష్ట్ర స్థాయి ఆవిర్భావసభకు కనివినీ ఎరుగని భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కనివినీ ఎరుగని సునామీ విజయం సాధించి ఉవ్వెత్తున ఎగసిన జనసేన తన విజయ ప్రస్థానాన్ని గోదావరి జిల్లా వేదికగా పంచుకోవాలన్న సంకల్పంతో ఇక్కడే సభను నిర్వహిస్తోంది.

వి..జయకేతనం!
పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ‘జయకేతనం’ కోసం వేదిక.. డిప్యూటీ సీఎం పవన్‌ రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల, కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎస్పీ బిందుమాధవ్‌

  • పిఠాపురం వేదికగా రేపే జనసేన 12వ రాష్ట్ర ఆవిర్భావ పండగ

  • రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది వస్తారని అంచనా

  • పిఠాపురంలో పవన్‌ అఖండ విజయం నేపథ్యంలో ఇక్కడే సభకు మొగ్గు

  • సభకు జయకేతనంగా నామకరణం.. ద్వారాలకు మన ప్రాంతీయుల పేర్లే

  • సభలో మహిళలు, మత్స్యకారులు, యువత, రైతు ప్రతినిధుల ప్రసంగాలు

  • అటు ఉమ్మడి జిల్లా కేంద్రంగా అయిదేళ్లలో ఉవ్వెత్తున జనసేన పోరాటాలు

  • అప్పటి అధికార వైసీపీపై ఇక్కడ నుంచే స్వయంగా పవన్‌ దండయాత్ర

  • రైతు సౌభాగ్య దీక్ష నుంచి వారిని ఆదుకోవడం వరకు ఎన్నో మైలురాళ్లు

  • అటు ఎన్నికల్లో సునామీ తీర్పుతో జనసేన వెంట నడిచిన గోదావరి జనం

  • వైసీపీకి ఒక్క సీటూ రానివ్వనన్న పవన్‌ శపథాన్ని నిజం చేసిన గోదారోళ్లు

  • జనసేన రాజకీయ చరిత్రలో ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా జనసేన పార్టీ జయకేతన సభకు సర్వసన్నాహాలు చేస్తోంది. పిఠాపురం కేంద్రంగా పార్టీ 12వ రాష్ట్ర స్థాయి ఆవిర్భావసభకు కనివినీ ఎరుగని భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కనివినీ ఎరుగని సునామీ విజయం సాధించి ఉవ్వెత్తున ఎగసిన జనసేన తన విజయ ప్రస్థానాన్ని గోదావరి జిల్లా వేదికగా పంచుకోవాలన్న సంకల్పంతో ఇక్కడే సభను నిర్వహిస్తోంది. అటు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అనేక ఆటుపోట్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా విజయం రుచి చూసి రాష్ట్ర రాజకీయ దశ, దిశను గోదావరి జిల్లా నుంచే మార్చినందున పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో సభను ఇక్కడే నిర్వ హిస్తున్నారు. మరోపక్క జనసేన అంటే ఉమ్మడి తూర్పు అనేలా పార్టీ ప్రస్థానం గడచిన పన్నెండేళ్లలో సాగింది. పవన్‌ ఉద్యమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను శుక్రవారం పిఠాపురంలో అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడిక క్కడ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలోని ఓ ప్రైవేటు లేఅవుట్‌లో రెండు లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధంచేస్తోంది. రాష్ట్రంతోపాటు తెలం గాణ, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది సభకు వస్తారని అంచనా. దీంతో స్వయంగా మంత్రి నాదెండ్ల కాకినాడ లోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వీరికి ఎక్కడా ఏ ఇబ్బంది ఎదురు కాకుండా వేలాదిమంది పోలీసులు, అంబులె న్స్‌లు, భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే తొ లుత అమరావతిలో మూడు రోజులు నిర్వహిం చాలని భావించిన ఆవిర్భావ సభను ఆ తర్వాత గోదావరి జిల్లాకు మార్చారు. జనసేనకు ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా సెంటి మెంట్‌గా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచే తన విజయకేతన సభను నిర్వహించాలని నిర్ణ యించింది. దీంతో పవన్‌ సైతం సభావేదికకు విజయకేతన సభ అని స్వయంగా నామకరణం చేశారు. అలాగే సభకు మూడు ప్రవేశ ద్వారా లు ఏర్పాటుచేయగా, వాటికి పిఠాపురం రాజా శ్రీరాజా సూర్యారావు బహుదూర్‌, విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌, అపర అన్న పూర్ణ డొక్కా సీతమ్మల పేర్లు పెట్టడం ద్వారా ఉమ్మడి జిల్లాకు తగిన ప్రాధాన్యం కల్పించారు. రాజకీయంగా ఇన్నేళ్లల్లో ఎన్నో ఆటుపోట్లను చూసిన జనసేనకు 2024 ఎన్నికలు కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టడం, తొలిసారి అధికారంలోకి రావడంతో సాకారమైన కలను అచ్చొచ్చిన గోదావరి జిల్లా నుంచే పంచుకోవా లనే ఉద్దేశంతో ఇక్కడే సభ నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి పిఠాపురంపైనే పడింది. తనకు రాజకీయంగా అండగా నిలబడుతోన్న గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచే 2024లో బరిలోకి దిగారు. అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యా రు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తిరుగులేని విజయం సాధించిపెట్టడంతో గోదావరి జిల్లా పై మరింత ప్రేమతో ఇక్కడి నుంచే తన విజ య ప్రస్థానం పంచుకోవాలని పవన్‌ భావిస్తు న్నారు. అటు సభలో పిఠాపురంలో తనను గెలి పించిన ప్రజలకు పవన్‌ ధన్యవాదాలు తెలప నున్నారు. మరోపక్క సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం ఐదు గంటలపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవన్‌కల్యాణ్‌ ప్రసంగంతో సభ ముగుస్తుంది.

పోరాటమే ఊపిరిగా..

జనసేన పార్టీ పుట్టిందే ప్రజాసమస్యలపై పోరుకోసం. పార్టీ ఆవిర్భావం నుంచి అధికా రంలోకి వచ్చిన వరకు ఇన్నేళ్లలో ఎన్నో సమ స్యలపై జనంకోసం జనసేన పోరాటాలు చేసిం ది. స్వయంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అనేక సమస్యలపై పోరాటాలను తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంబించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు, అక్ర మాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కదిలి అప్పటి సర్కారు వెన్నులో వణుకు పుట్టించారు. దీంతో జనం తమ సమస్యల కోసం ఎన్నోసార్లు జనసేనవైపు చూశారు. ఉమ్మడి జిల్లాలో గత వైసీపీ పాలనలో అన్నదాతలు తీవ్రంగా నలిగి పోయారు. సాగునీటి నుంచి గిట్టుబాటు ధర వరకు సమస్యలే. దీంతో 2019 డిసెంబరులో కాకినాడ కేంద్రంగా రైతు సౌభాగ్య దీక్షతో ప్రభు త్వాన్ని కదిలించారు. రహదారుల గుంతలతో జనం పడుతున్న నరకయాతన నేపథ్యంలో ప్రభుత్వాన్ని కదిలించడం కోసం 2021 అక్టోబ రులో రాజమహేంద్రవరంలో పవన్‌ పర్యటిం చారు. స్వయంగా రహదారులపై గుంతలు పూ డ్చారు. 2022లో కౌలురైతు భరోసా యాత్ర పేరుతో మండపేటలో అన్నదాతల కుటుంబా లకు సొంతంగా చెక్‌లు పంపిణీ చేశారు. ఇలా ఒకటేంటి అనేక సమస్యలపై చలించి కదిలారు. ఇలా ప్రతి కష్టంలోను జనసేన ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్య మమై కదిలింది. అనేకసార్లు పవన్‌ మాట్లాడు తూ జనసేనకు అధికారం ముఖ్యం కాదని జనం సమస్యలు పరిష్కారమే కీలకమని ప్రక టించారు. ప్రజల కోసం ప్రభుత్వాలపై ఎంత వరకు అయినా పోరాడుతుందని చేసి చూపిం చారు. దీంతో గడచిన అయిదేళ్లలో గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో మరింతగా నాటుకుపో యింది. దీని ఫలితంగా పంచాయతీ, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో చిన్నచిన్న విజయాలతో జిల్లాలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిం చింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు టీడీపీతో పొత్తు కుదరడంతో ఆ కల యిక గోదావరి జిల్లాలో ఓట్ల సునామీ సృష్టించింది. దీంతో అరాచక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అయితే అధికారం అండతో గత వైసీపీ ప్రభుత్వం గోదా వరి జిల్లాను ధ్వంసం చేసి అరాచకంగా మా ర్చేసిందని ఎన్నికలప్పుడు పవన్‌ ధ్వజమెత్తారు. అందుకే గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసుకునే బాఽధ్యత తనది అని హెచ్చరించారు. పవన్‌ చేసిన శపథానికి గోదావరి ప్రజలు అండగా నిలబడి నిజం చేశా రు. ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటూ వైసీపీకి రాకుండా గుండా సున్నా మిగిల్చారు.

Updated Date - Mar 13 , 2025 | 01:34 AM