Share News

జల ప్రహార్‌.. సైనికా జోహార్‌!

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:38 AM

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ డీప్‌ సముద్రంలో భారత నౌకా దళం ఆఽధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఉభయ చర వ్యాయామం (జల ప్రహార్‌-25) యుద్ధ విన్యాసాలు విజయవంతంగా ముగిసినట్టు అధి కారులు తెలిపారు. ఉమ్మడి సైనిక విన్యాసం, యుద్ధ సన్నదతను మరింత మెరు

జల ప్రహార్‌.. సైనికా జోహార్‌!
కాకినాడ తీరంలో యుద్ధ విన్యాసాల దృశ్యాలు

కాకినాడ తీరంలో ముగిసిన యుద్ధ విన్యాసాలు

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ డీప్‌ సముద్రంలో భారత నౌకా దళం ఆఽధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఉభయ చర వ్యాయామం (జల ప్రహార్‌-25) యుద్ధ విన్యాసాలు విజయవంతంగా ముగిసినట్టు అధి కారులు తెలిపారు. ఉమ్మడి సైనిక విన్యాసం, యుద్ధ సన్నదతను మరింత మెరుగుపరచడానికి ఈ విన్యాసాలను ఏటా భారత త్రివి ధ దళాల ఆధ్వర్యంలో కాకినాడ సముద్ర తీరంలో నిర్వహి స్తున్నాయి. దైవార్షిక ఉమ్మడి వ్యాయామం జల ప్రహార్‌ను భారత దేశ తూర్పు సముద్ర తీరంలో ఉభయచర కార్యకలాపాల్లో సెంటర్‌-సరీస్‌ సినర్జీ, కార్యాచరణ ప్రణాళిక అమలును ధృవీకరించడం, త్రివిధ దళాల సన్న ద్ధతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుని సెప్టెంబరు 21-23 వరకు కాకినాడ సముద్ర మధ్యభా గంలో విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎ న్‌ఎస్‌ ఘరియల్‌లోకి సైన్య దళాలను ప్రవేశ పెట్టడం, ఏకీకృతం చేయడం చేశారు. ఈ విన్యా సాల్లో భాగంగా ఆన్‌బోర్డు శిక్షణ, భద్రతా బ్రీఫిం గ్‌లు, నావికుడి జీవితం వైపు దృష్టి సారిం చడం, క్రీడలు, స్నేహాన్ని పెంపొం దించేందుకు ఈ ఉమ్మడి పరస్పర విన్యాసాలు ఎంతగానో దోహద పడతాయని అధికారులు తెలిపారు. విన్యాసాల్లో భాగంగా సముద్రతీరంలో హార్డ్‌ బీచింగ్‌, ఎన్‌సీల, బీఎంపీలను ప్రారంభించి, ఎస్‌ఓపీలు, ఉమ్మడి శిక్షణ అంతా ఒక పద్ధతిలో విన్యాసాలు నిర్వహిం చినట్లు త్రివిధ దళాల అఽధికారులు తెలిపారు. ఈ వ్యాయామం రెండు దశల్లో నిర్వహించగా, మొద టి దశలో ఈనెల 16నుంచి 20 వరకు విశాఖ ప ట్నంలో హార్బర్‌దశలో చేయడం జరిగిందన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:38 AM