Share News

జైళ్ల శాఖలో కృత్రిమ మేథ

ABN , Publish Date - May 08 , 2025 | 12:29 AM

రాజమహేంద్రవరం, మే 7(ఆంధ్రజ్యోతి): జైళ్ల శాఖలో కృత్రిమ మేథ ఉపయోగించి గార్డింగ్‌ సిబ్బందిపై ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించడంతోపాటు మరింత పటిష్టమైన భద్ర తా చర్యలు చేపట్టబోతున్నామని జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవ

జైళ్ల శాఖలో కృత్రిమ మేథ
సెంట్రల్‌ జైలును పరిశీలిస్తున్న అంజనీ కుమార్‌

డీజీ అంజనీ కుమార్‌

రాజమహేంద్రవరం, మే 7(ఆంధ్రజ్యోతి): జైళ్ల శాఖలో కృత్రిమ మేథ ఉపయోగించి గార్డింగ్‌ సిబ్బందిపై ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించడంతోపాటు మరింత పటిష్టమైన భద్ర తా చర్యలు చేపట్టబోతున్నామని జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవ రంలో కేంద్ర కారాగారాన్ని, మహిళా ప్రత్యేక కారాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సప్‌ గవర్నెన్స్‌, కృత్రిమ మేఽథ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు సంకల్పించార న్నారు. జైళ్లలో కూడా వాటిని వినియోగించు కునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఖైదీ లతో మాట్లాడి సమస్యలు, సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. కొందరు ఖైదీలు వారి ఇబ్బందులను విన్నవించుకోగా నిబంధన లను అనుసరించి వాటిని పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. ఈ-ములాఖత్‌ ద్వారా ఖైదీలు వారి ఇంటికి నేరుగా వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుకోడానికి చర్యలు చేపట్టామన్నా రు. డీజీని కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మర్యా ద పూర్వకంగా కలిసి పలుఅంశాలపై చర్చించా రు. జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవి కిరణ్‌, పర్యవేక్షణాధికారి రాహుల్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:29 AM