Share News

నేతలు..మహా మేతలు!

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:44 AM

నేతలు.. మేతలు.. పేదల ఇళ్ల స్థలాల ముసు గులో గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు, అధికారులు ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్లు మెక్కేశారు. అంచనాలు అడ్డంగా పెం చేసి.. కోట్లలో బిల్లులు నొక్కేసి ఖజానాకు పంగ నామాలు పెట్టారు.

నేతలు..మహా మేతలు!
అవినీతి ఆరంభం : కాకినాడ జిల్లా కొమరగిరిలో జగనన్న ఆరంభించిన లేఅవుట్‌

జగనన్న లేఅవుట్లలో భారీ అవినీతి

ప్రత్యేక బృందాలతో విచారణ

అడ్డగోలు చెల్లింపులపై ఆరా

రూ.70 కోట్లు బిల్లుల పెండింగ్‌

వేట ఆరంభించిన ప్రభుత్వం

లేఅవుట్లలో 80 శాతం అక్రమాలే

వెలుగు చూస్తున్న వైనం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

నేతలు.. మేతలు.. పేదల ఇళ్ల స్థలాల ముసు గులో గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు, అధికారులు ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్లు మెక్కేశారు. అంచనాలు అడ్డంగా పెం చేసి.. కోట్లలో బిల్లులు నొక్కేసి ఖజానాకు పంగ నామాలు పెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జి ల్లాలో 1600 లేఅవుట్లలో సుమారు 19 వేల ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇతర విషయాలలో అవ కతవకలు జరిగినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు అవినీతి డొంక కదల్చడానికి నేరుగా రంగంలోకి దిగింది. డ్వామా ఏపీడీలు, రాజధాని నుంచి పంపిన నరేగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలతో వేట మొదలుపెట్టింది.

కాకినాడలో 324 లేఅవుట్లు..

కాకినాడ జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం 3,84,218 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు గుర్తించింది. 7,218 ఎకరాలు కావాల్సి ఉండగా 1,856 ఎకరాల ప్రభుత్వ భూమిపోను 5,362 ఎకరాలను రూ.2,566 కోట్లతో రైతుల నుంచి కొనుగోలుచేసింది. 2020 డిసెంబరు 25న అప్ప టి సీఎం జగన్‌ కొమరగిరి వచ్చి తొలిసారిగా ఇళ్ల స్థలాల పథకం ప్రారంభించారు. అలాగే జిల్లావ్యాప్తంగా 324 లేఅవుట్లలో పేదలకు స్థలా లు కేటాయించారు. ప్రభుత్వం మారగానే జగన న్న లేఅవుట్లలో అక్రమాలపై విజిలెన్స్‌ అధికారు లు దృష్టిపెట్టారు. 80 శాతం లేఅవుట్లలో భారీ అవినీతి జరిగిందని నిర్ధారించారు. కాకినాడ జిల్లాలో రూ.321 కోట్ల రెట్టింపు అంచనాలతో 152 లేఅవుట్లలో చేసిన పనులపై విచారణకు ఆదేశించింది. మరో 121 లేఅవుట్లలో పెండింగ్‌ లో ఉన్న రూ.42 కోట్ల బిల్లుల అవినీతిపైనా దృష్టి పెట్టింది. 324లేఅవుట్లలో చదును చేసిన రూ.650 కోట్ల బిల్లుల లెక్క తేల్చబోతోంది.

డొంకంతా కదలాల్సిందే..

విజిలెన్స్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు పంపిన నివేదిక ఆధా రంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బృందా లను నియమించింది. అక్రమాలు భారీగా ఉన్న లేఅవుట్లలో ఎంతమేర నిధులు మెక్కేశారో తేల్చాలని నిర్ణయించింది. విచారణను రెండు భాగాలుగా విభజించింది. తొలి భాగం కింద జరిగిన పనుల పెండింగ్‌ బిల్లులకు సంబం ధించి అక్రమాలపై విచారణ చేపడతారు. ఈ తరహా జిల్లాలో 121 లేఅవుట్లను గుర్తించారు. చదును, రహదారులు, డ్రైన్లు, మంచినీరు తది తర పనులకు రూ.120 కోట్ల వరకు ఇదివరకే చెల్లించగా ఇంకా రూ.42 కోట్లు బాకీలు చూపి స్తున్నారు. ఆయా లేఅవుట్లను తనిఖీ చేస్తున్నా రు. రెండో అవినీతి కింద అనేక లేఅవుట్లలో అవ సరం లేకున్నా ఒక్కో లేఅవుట్‌లో రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు కాకిలెక్కలతో బిల్లులు చేసు కుని డబ్బులు కాజేశారు. జిల్లాలో 17 మండలా ల్లో 152 లేఅవుట్లకు రూ.321 కోట్ల వరకు వ్యయ అంచనాలు చూపించారు. ఎకరాకు రూ.25 లక్షలకుపైగా చదును బిల్లులు చూపించి కోట్లలో డబ్బులు కొట్టేశారు. ఒక్క కాకినాడ జిల్లాలోనే 324 లేఅవుట్లలో చదునుకు సంబంధించి రూ.650 కోట్ల వరకు బిల్లులు అప్పట్లో చెల్లిం చగా ఇందులో రూ.220 కోట్ల వరకు తప్పుడు బిల్లులే ఉన్నట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది.

అతి పెద్ద స్కామ్‌ ఇక్కడే..

అతిపెద్ద స్కాం కొమరగిరి లేఅవుట్‌లోనే ఉన్నట్టు విజి లెన్స్‌ నిర్ధారించింది. అప్పట్లో సీఎం జగన్‌ ఇక్కడి నుంచి పేదల ఇళ్ల పథకం ప్రారంభిం చడంతో లోతట్టుగా ఉన్న 350 ఎకరాల కొమరగిరి భూములు చదునుకు రూ.125 కోట్ల వరకు వెచ్చించింది. ఈ పనులు అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేశారు. గ్రావెల్‌ను పోలవరం కాలువలు, పెద్దాపురం రామేశంమెట్ట నుంచి తరలించేశారు. అధికారులేమో అడ్డగోలుగా రూ.35 కోట్ల వరకు బిల్లులు ఇచ్చేశారు. దీనిపై అప్పట్లో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్‌ చదునుకు ఎకరా కు కనీసం రూ.15 లక్షల్లోపు చేయాల్సి ఉన్నా రెట్టింపు బిల్లులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసినా చర్యల జోలికి వెళ్లలేదు. విచారణ బృందాలు ఈ అక్రమాలు తవ్వనున్నాయి.

తూర్పున మెక్కేశారు!

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

తూర్పుగోదావరి జిల్లాలోనూ పేదల ఇళ్ల స్థలాల పేరుతో కోట్లలో మెక్కేశారు. అవినీతి లెక్కతేల్చడానికి రాజమండ్రి రీజియన్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ స్నేహిత ఆధ్వ ర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు 4 బృందాలు ఏర్పాటుచేశారు. 324 లేఅవుట్లకు సంబంధించి రూ.6.6 కోట్లు అవక తవకలు జరిగినట్టు నిర్ధారించారు. రెట్టింపు అం చనాలకు సంబంధించి 7 మండలాల్లో 22 కోట్లు అవకతవకలు జరిగినట్టు తేల్చారు. లోతట్టు ప్రాంతాల్లో నిబంధనల మేరకు ఫిల్లింగ్‌ చేయ కుండా వదిలేసిన కొన్ని ఇళ్లను గుర్తించారు. ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి, మధుర పూడి తదితర ప్రాంతాల్లో పనికిరాని ఆవ భూ ములకు ఎకరానికి రూ.43 లక్షల వంతున చెల్లించి అవకతవకలకు పాల్పడిన సంగతి తెలి సిందే. దీనిపైనా విచారణ జరుగుతోంది. ఆవ భూమిలో సుమారు 6 మీటర్ల లోతు వరకూ నీరు నిలిచిపోతుందని.. ఇది నివాస యోగ్యం కాదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికా రులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అసలు రైతుకు ఎంత ఇచ్చారు. అప్పట్లో అక్కడ మార్కెట్‌ విలువ ఎంత? ఎంత ఎక్కువ చెల్లిం చారు. ఎవరెవరి ప్రమేయం ఇందులో ఉందనే తదితర అంశాలపై నిశితంగా విజిలెన్స్‌ అధికా రులు ఆరా తీస్తున్నారు. త్వరలో అవకతవకల నిగ్గుతేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

కోనసీమలోనూ..కుమ్ముడే

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో వేసిన లేఅవుట్లలో ఫిల్లింగ్‌ అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. జిల్లాలోని నీటి యాజమాన్య సంస్థకు చెందిన ముగ్గురు ఏపీడీలు, అమరావతి నుంచి వచ్చే నరేగా క్వాలిటీ కంట్రోల్‌ టీమ్‌ సభ్యులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 111 లేఅవుట్లలో 241 పనులకు సంబంధించి రూ.21 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు గతంలో చేసిన, చేయని పనులకు కూడా భారీగా నిధులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన పనులను పర్యవేక్షించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ టీమ్‌లు రంగంలోకి దింపింది. ఈ టీమ్‌లు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నాయి. పెండింగ్‌ బిల్లులతోపాటు గ తంలో కాలనీల్లో జరిగిన అక్రమాలపై ఈ బృందం విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

Updated Date - Jun 28 , 2025 | 12:44 AM