ఉయ్..వీఆర్‌ఎస్!
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:27 AM
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నా యా లేదా.. ఆఫీసులకు వెళితే అధికారులు పట్టించుకుంటున్నారా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారా?
ఫోన్‌లో అడిగి.. స్పందిస్తారు
నేరుగానూ ఫిర్యాదు చేయవచ్చు
మిల్లర్ల దోపిడీపై రైతులు ఆవేదన
వెంటనే స్పందించిన జేసీ
9 మిల్లులకు షోకాజ్ నోటీసులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నా యా లేదా.. ఆఫీసులకు వెళితే అధికారులు పట్టించుకుంటున్నారా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అం టూ ప్రభుత్వం నుంచి ఏదైనా ఫోన్ వస్తుందా.. ఇంకేంటి ఆలస్యం.. మీకే ఏదైనా సమస్య ఉంటే వెంటనే చెప్పేయండి..ఎంత వేగంగా చెబు తా రో అంతే వేగంగా సమస్య పరిష్కారమై పో తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి నేరుగా సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తున్న ఆర్టీజీఎస్ సిస్టమ్‌లో భాగమైన ఐవీఆర్‌ఎస్ కాల్స్ వల్ల అనేక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి.వ్యవస్థలో జరిగే అవినీతి వ్యవహారాలు బయటకొస్తున్నాయి.ఇటీవల జిల్లాలో ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతుల నుంచి అన్‌లో డింగ్, ఇతర చార్జీలు వసూలు చేస్తున్నారనే సంగతి ఐవీఆర్‌ఎస్ వల్లే బయటకు వచ్చింది.
ఐవీఆర్‌ఎస్ పనిచేస్తుందిలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వేగవం తంగా పారదర్శకతతో సేవలు అందించడానికి రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ఫిర్యాదులు, సేవలు వంటివి ప్రజలకు సరైన సమయంలో చేరుతున్నాయా లేదా అనే వాటిపై సమాచారం సేకరిస్తుంది. ఇది రాష్ట్ర రాజధాని నుంచి పని చేస్తుంది. ఇది జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ పథకాలు అమలుతీరు, అధికా రుల పనితీరుపై కూడా ఆరా తీస్తుంది. ఐవీ ఆర్‌ఎస్ అంటే (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్). మనిషి జోక్యం లేకుండా కాల్స్ ద్వారా సమాచారం సేకరిస్తుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో క్యూఆర్ కోడ్ కూడా పెడుతు న్నారు.వాటిని స్కాన్ చేసి సమస్యలు చెప్ప వచ్చు.ఫిర్యాదులు ఇవ్వవచ్చు. వాట్సప్‌లో ఫిర్యా దు చేసే విధానం కూడా ఇటీవల వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద ఆర్టీజీఎస్ పర్యవేక్షణ ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తుం టుంది. ప్రజలు దీనిని సద్వినియోగం చేసు కుంటే అనేక విషయాలు వెలుగుచూస్తాయి. ఏదైనా పథకం మీద ప్రజలు సంతృప్తి చెందితే చెందినట్టు, అసం తృప్తి ఉంటే అసంతృప్తి ఉన్నట్టు, ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని కూడా పంపిస్తారు. కానీ ఇక్కడ సమాచారం ఇచ్చినవారి, ఫిర్యాదు చేసిన వారి వివరాలేమీ ఉండవు. అవన్నీ గోప్యంగానే ఉంటాయి.
ఐవీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు..9 మిల్లులకు నోటీసులు..
కడియం మండలం మురమండ రైతు సేవా కేంద్రానికి చెందిన రైతులు ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై ఐవీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొను గోలు చేయాలి.రైతులు తమ ధాన్యాన్ని రవాణా చేసుకోవడానికి వీలుగా ఒక గోనె సంచికి విని యోగ చార్జి కింద రూ.4.74 పైసలు, హమాలీ చార్జీల కింద ఒక్కొక్కరికి రూ.22 వం తున ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే రైతు తమ ధాన్యాన్ని ప్రభుత్వం చెప్పిన మిల్లుకు తీసుకెళ్ల డానికి ఈ సొమ్ములు చెల్లిస్తోంది. కానీ కొంత మంది మిల్లర్లు మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడ్ చేయడానికి క్వింటాకు అదనంగా రూ.50 వర కూ వసూలు చేస్తున్నట్టు రైతులు ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రభు త్వం సీరియస్ అయింది. ఆర్‌టీజీఎస్ ద్వారా సేకరించిన ఫిర్యాదులను ఉన్నతాధికారులు జిల్లా అఽధికారులకు పంపారు. జేసీ వై.మేఘా స్వరూప్ రంగంలోకి దిగారు. ప్రారంభ దర్యా ప్తులో అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, కడియం, కోరుకొండ మండలాలకు చెందిన 9 రైస్ మిల్లు లో అనధికార వసూళ్ల గుర్తించి షోకాజ్ నోటీ సులు ఇచ్చారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని హెచ్చరించారు. కానీ ప్రస్తుతం జేసీ సెలవులో ఉన్నారు. ఈలోపు మిల్లర్లు షోకాజ్ నోటీసులకు ఏమి సమాధానం ఇస్తారో చూడాలి. సంతృప్తికరమైన సమాధానం రాక పోతే మిల్లులకు రైస్, ధాన్యం అలాట్‌మెంట్ నిలిపివేస్తారు. మిల్లులను బ్లాక్ లిస్ట్‌లలో పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితులలో మిల్లుల యజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.ఇలా ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా దోపిడీని వెలుగులోకి తేవొచ్చనేది రైతుల ఉదంతమే స్పష్టం చేస్తోంది.