అమ్మ..బడును
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:50 AM
మీకు ఆడబిడ్డ కావాలా..? మగ బిడ్డ కావాలా..? లేదంటే ఒకేసారి అయిపోతోంది.. కవల పిల్లలు కావా లా? మగ బిడ్డకైతే ఒక రేటు.. ఆడ బిడ్డకైతే మరో రేటు.. కవల పిల్లలకైతే ఒక రేటు.. ఇలా అమ్మత నానికి రేటు కట్టేశారు.. వైద్యం పేరుతో దందాకు తెర లేపారు.. ఇష్టానుసారం దోచేస్తు న్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది దంపతులు కూడా ఆలోచించుకో లేకపోతున్నారు. పిల్లలు కావాలనే ఆశతో వాళ్లు ఏం చెబితే దానికి ఊకొడుతూ లక్షలు పోస్తున్నారు.
అమ్మతనానికో రేటు
ఫెర్టిలిటీ మాటున కాసుల వేట
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం
ఉమ్మడి జిల్లాలో 50 కేంద్రాలు
పిల్లల కోసం రూ.లక్షల్లో వసూళ్లు
పేరుకే ఐయూఐ, ఐవీఎఫ్
మోసపోతున్న దంపతులు
సికింద్రాబాద్ ఘటనతో ప్రకంపన
మీకు ఆడబిడ్డ కావాలా..? మగ బిడ్డ కావాలా..? లేదంటే ఒకేసారి అయిపోతోంది.. కవల పిల్లలు కావా లా? మగ బిడ్డకైతే ఒక రేటు.. ఆడ బిడ్డకైతే మరో రేటు.. కవల పిల్లలకైతే ఒక రేటు.. ఇలా అమ్మత నానికి రేటు కట్టేశారు.. వైద్యం పేరుతో దందాకు తెర లేపారు.. ఇష్టానుసారం దోచేస్తు న్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది దంపతులు కూడా ఆలోచించుకో లేకపోతున్నారు. పిల్లలు కావాలనే ఆశతో వాళ్లు ఏం చెబితే దానికి ఊకొడుతూ లక్షలు పోస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
అమ్మతనానికో రేటు పెట్టేశారు.. ఇష్టానుసారం అమ్మే స్తున్నారు.. ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్నా.. ఒక్కో జంట నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ లాగేస్తున్నా చూస్తూ ఊరుకుం టున్నారు. పిల్లలు కావాలనే ఆశతో వస్తున్న దంప తుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.. అయినా అడిగే నాథుడు లేడు..పట్టించుకునే పెద్దాయన లేడు..ఎవరు ఎంత చెబితే అంత.. సికింద్రాబాద్‌లోని ఒక సంతాన సాఫల్యత కేంద్రం లో జరిగిన ఘరానా మోసం ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. మారిన జీవనశైలి కారణంగా నగరాలు, పట్టణాల్లో 30 నుంచి 40 శాతం మంది దంపతులు సంతాన లేమితో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇటువంటి వారి సంఖ్య పెరుగుతోంది.ఇదే ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. పిల్లల కోసమని తమ వద్దకు వచ్చేవారిని వారి అండాలు, శుక్రకణాలతోనే సంతానం కలుగుతుందని చెప్పి అక్రమ మార్గాల్లో దాతలవి వినియో గిస్తూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు.
బలహీనతను క్యాష్ చేసుకుని..
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రాల వద్దకు వచ్చేవారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. ముందుగా పలు పరీక్షల పేరుతో దందా ఆరంభమవుతుంది.పరీక్షలకే రూ.లక్ష వరకూ లాగే స్తారు. సంతానం కోసం వచ్చే వారి నుంచి రెండు నుంచి మూడేళ్ల పాటు వీలైనంత ఎక్కువ సొమ్ములు లాగడమే లక్ష్యంగా ఎక్కువ కేంద్రాలు నడుస్తున్నాయి. వచ్చిన దంపతులకు వారి వీర్యకణాలు, అండాలు వినియోగిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రాలు అసలు విషయాన్ని వారికి చెప్పకుండా మోసాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఇదే జరిగింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు ఇదే పద్ధతి అవ లంభిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న పురుషుల నుంచి వీర్యకణాలు,మహిళల నుంచి అండాలు సేకరిస్తున్నా రు. వైద్యానికి వచ్చే దంపతుల అండాలు, వీర్యకణాలు సేకరించి ఏది లోపం ఉంటే అది తీసేసి వేరే వారిది వినియోగించి ఐవీఎఫ్ పద్ధతిలో ఫలదీకరించి మహిళ గర్భాశయంలో ప్రవేశపెడుతున్నారు.విషయం తెలిసినా చాలా మంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు.ఇదే సమయంలో వీర్యకణాలు, అండం సేకరించే యువతీ, యువకులకు మితిమీరి ఇంజక్షన్లు చేయడంతో వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పర్యవేక్షణ లేక.. ఇష్టారాజ్యం..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో ఉన్న సంతాన సాఫల్యకేంద్రాలు, ఐవీఎఫ్, ఐ యూఐ, టెస్ట్‌బ్యూట్ సెంటర్ల నిర్వహణపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేదనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ కేంద్రాలన్నీ జాతీయ, రాష్ట్రస్థాయి లో అనుమతులు, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. దాతల వీర్యకణాలు,అండం వినియోగిస్తే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, రెగ్యులైజేషన్ యాక్ట్ ప్రకారం లైసెన్సు తీసుకుని వాటి మార్గదర్శకాలకు లోబడి కేం ద్రాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కువ కేంద్రాలు ఈ నిబంధనలు పాటించడం లేదు.అయినా ఇప్పటి వరకూచర్యలు లేవు. కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించి మో సాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
సంతానలేమితో బాధపడుతున్న దంపతులే టార్గెట్‌గా ఇప్పు డు టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్లు, ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్లు, సంతాన సాఫల్యత కేంద్రాలు ఇలా రకరకాల పేర్లుతో వ్యాపార దందాకు తెరలేపాయి. వీటిల్లో అతి తక్కువ కేంద్రాలు మాత్రమే సంతా నం కోసం వచ్చిన దంపతులకు అన్ని విషయాలు వివరించి, వారి అండా లు, వీర్యకణాలు సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరించి మహిళల అండా(గర్భా)శయంలోకి ప్రవేశపెట్టడం ద్వారా సంతానభాగ్యం కల్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలోని కాకినాడ,రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి.ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది వైజాగ్, హైదరాబాదులోని కేంద్రాలకు వెళ్తున్నారు.
పెళ్లి ఆలస్యమైతే సంతానలేమి..
సొసైటీలో ఇటీవల సంతానలేమి సమస్య బాగా పెరి గింది. పెళ్లయిన జంటలకు నార్మల్‌గా పిల్లలు పుట్టే పరిస్థితి తగ్గుతోంది. ఇది ఆందోళన కల్గించే విషయం. సంతానం కోసం ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టినా పిల్లలు పుడతారనే గ్యారంటీ ఉండడంలేదు. పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం కూడా సంతానలేమికి ఒక కారణం. వివాహిత 25 ఏళ్లలోపు పిల్లలను కనడం సరైన సమయం. యువత లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.
- బి.అక్కమాంబ, గైనిక్ విభాగం హెచ్‌వోడీ, రాజమహేంద్రవరం జీజీహెచ్