ఇలాగైతే సాగునీరు పారేదెలా?
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:57 AM
గోదా వరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంట చేల్లో మాత్రం నీరు కరువైంది. ప్రధాన పంట కాల్వల్లో సైతం గుర్రపుడెక్క పేరుకుపోవడం తో సాగునీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుం డా పోయింది. రాజవరం-పొదలాడ రహదారి లో అనేకచోట్ల గుర్రపుడెక్కతోపాటు తీగమొ క్కలు పేరుకుపోయాయి. గుర్రపుడెక్కను తొలగించడానికి నిధులు మంజూరైయ్యాయని రాజకీయ పెద్దలు, అధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆ దిశగా చర్యలు కానరావడం లేదు.
ప్రధాన పంటకాల్వలు ఆధ్వానం
పట్టించుకోని ఇరిగేషన్, నీటి సంఘాలు
పి.గన్నవరం, జూలై21(ఆంధ్రజ్యోతి): గోదా వరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంట చేల్లో మాత్రం నీరు కరువైంది. ప్రధాన పంట కాల్వల్లో సైతం గుర్రపుడెక్క పేరుకుపోవడం తో సాగునీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుం డా పోయింది. రాజవరం-పొదలాడ రహదారి లో అనేకచోట్ల గుర్రపుడెక్కతోపాటు తీగమొ క్కలు పేరుకుపోయాయి. గుర్రపుడెక్కను తొలగించడానికి నిధులు మంజూరైయ్యాయని రాజకీయ పెద్దలు, అధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. వృక్షాలు, గుర్రపుడెక్క పేరుకుపోయి ప్రధాన పంటకాల్వలు అస్తవ్యస్థంగా కనిపిస్తున్నాయి. జూన్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రెండుసార్లు కాల్వల్లో గుర్రపుడెక్క తొలగించాల్సి ఉంది. కానీ జూలై మాసాంతం పూర్తవుతున్నప్పటికీ ఇంకా పలుచోట్ల పంట కాల్వలు గుర్రపుడెక్కతోనే దర్శనమిస్తున్నాయి. సాగునీటి వేగానికి అడ్డంకులు తొలగిస్తే నీరు శివారు పంటచేలకు సైతం అందే అవకాశం ఉంది. అయితే ఇరిగేషన్ అధికారులు కాల్వ లను కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి నెల కొంది. మరోవైపు నీటిసంఘాలు వచ్చినప్ప టికీ నీటిఎద్దడి బాధ తప్పడంలేదని రైతన్న లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడేళ్లుగా కన్నెత్తి చూడలేదు..
గడిచిన ఏడేళ్ల నుంచి పంటకాల్వలపై పాలకులు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో పంటకాల్వలు అధ్వానంగా మారాయి. పంట కాల్వల సామర్థ్యం బట్టి సాగునీరు విడుదల అవుతున్నప్పటికీ శివారు ప్రాంతాలకు నీరు అందడంలేదని నీటి సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. కాల్వల్లో పూడికతతీత భారీ గా పెరగడంతోపాటు కాల్వలు బలహీనంగా మారాయని చెబుతున్నారు. పంటకాల్వ ప్రా రంభంలో సాగునీరు పోటెత్తుతున్నప్పటికీ శివారు పంట పొలాలకు మాత్రం వెళ్లడం లేదు. ఇటీవలే పలు ఛానళ్ల పరిధిలో పంట కాల్వల్లో పూడికతీత పనులు నిర్వహించినప్ప టికీ అనేక పంటకాల్వల గట్లు ఇప్పటికీ బల హీనంగానే ఉన్నాయి. దీనికితోడు పారుదల వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీంతో కాల్వల సామ ర్థ్యం మేర సాగునీరును విడుదల చేసినప్పటికీ శివారు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం పంటకాల్వల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగిస్తే సాగునీరు ముందు కు పోతుందని రైతులు పేర్కొంటున్నారు.
సాగునీటి సరఫరాలో అడ్డంకులు!
మండపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఆకుమడులు పడ్డాయి. నాట్లూ పడుతున్నాయి. కానీ ఈ దశలో సాగునీటి పారుదలకు అడ్డం కులు తప్పడం లేదు. మండపేట పట్ట ణ పరిధిలోని గొల్లపుంతకాలనీకి వెళ్లేదా రిలో ఉన్న పంటకాల్వ వ్యర్థాలతో నిండి సాగునీరు పారేందుకు వీల్లేకుండాపో యిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాగునీరు దిగువకు అందకపోవడంతో వరిచేలు దెబ్బతింటు న్నాయని వారు చెబుతున్నారు. తమకు సాగునీరు అందించే పంటకాల్వలో వ్యర్థా లు, గుర్రపుడెక్క పెరిగిపోయి ఇబ్బంది కలుగుతోందని, దీనివల్ల అనేక పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ పంట కాల్వ ను ఇరిగేషన్‌శాఖ సాగునీటి సంఘాల అధ్యక్షులు పరిశీలించి సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతాంగం కోరుతోంది.