Share News

సాగు, తాగునీటి భద్రతకు చర్యలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:44 AM

భగర్భ జలాల రీచార్జికి, సాగు, తాగునీటి నీటి భద్రతకు సమన్వయంతో చర్యలు తీసు కోవాలని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాలువలు, చెరువుల సంరక్షణకు ప్రాధాన్యమి వ్వాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఆయా వినియోగదారుల సంఘాలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. గురువారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

సాగు, తాగునీటి భద్రతకు చర్యలు
కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

  • కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యో తి): భగర్భ జలాల రీచార్జికి, సాగు, తాగునీటి నీటి భద్రతకు సమన్వయంతో చర్యలు తీసు కోవాలని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కాలువలు, చెరువుల సంరక్షణకు ప్రాధాన్యమి వ్వాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఆయా వినియోగదారుల సంఘాలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. గురువారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వివరా లను వెల్లడిస్తూ.. నీటి వినియోగదారుల సం ఘాలు, అధికారులు,ప్రజా ప్రతినిధులతో నీటి భద్రత, భూగర్భ జలాల రీచార్జి, కాలువలు, చెరువుల నిర్వహణ తదితర అంశాలపై సమ గ్ర చర్చలు నిర్వహించామన్నారు. జిల్లాలోని గోపాలపురం, అనపర్తి, గోకవరం మండలాల్లో బోరుబావులపై అధికంగా ఆధారపడడం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిందన్నారు. గోదా వరి డెల్టా మండలాల్లో మాత్రం సాధారణ స్థాయిలో ఉన్నాయన్నారు. భూగర్భ జలాల రీచార్జీ కోసం నీటి కుంటలను తవ్వించే పను లను ఉపాధి హామీ పథకంలో భాగంగా చేప డతామని సీఎంకి వివరించారు.సాంకేతిక మా ర్గదర్శకాలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. కాలువలు ఆక్రమణలకు గురికాకుం డా, తూడు తొలగింపు, పూడిక తీత పనులను చేపట్టి, శివారు భూములకు కూడా నీరు వెళ్లే విధంగా నీటి వినియోగదారుల సంఘాలు, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకో వాలన్నారు. తాగు, సాగు, పరిశ్రమలకు నీళ్లు చాలా అవసరమన్నారు. అందువల్ల నీటి భద్ర తలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించా లని సూచించారు. రానున్న రోజుల్లో క్యాచ్‌ మెంట్‌ ఏరియాల వారీగా ఇరిగేషన్‌ అధికారు లను కేటాయించి, రైతులు, నీటి సంఘాల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో నీటి భద్రత, భూగర్భ జలాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోం దని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జేసీ చిన్న రాముడు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ గిరిధర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ శేషుబాబు, తొర్రిగడ్డ పంపింగ్‌ స్కీం అధ్యక్షుడు వేగి శ్రీనివాసరావు, సూరంపాలెం ప్రాజెక్టు అధ్యక్షుడు ఉంగరాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:44 AM