Share News

డీఎల్‌పీవో కార్యాలయ ఏవోపై విచారణకు డీఆర్వో ఆదేశం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:42 AM

కార్పొరేషన్‌(కాకినాడ), సెప్టెంబరు 15(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లాలో జిల్లా పంచాయతీ శాఖలో పనిచేస్తున్న పలువురు ఎస్సీ, బీసీ ఉద్యో గులపై తప్పుడు గ్రీవెన్స్‌ ఫిర్యాదులు చేయిస్తూ ఆ ఫిర్యాదులు క్లోజ్‌ చేయడానికి సదరు ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరో పణలపై కాకినాడ డీఎల్‌పీవో

డీఎల్‌పీవో కార్యాలయ ఏవోపై విచారణకు డీఆర్వో ఆదేశం

ఎస్సీ, బీసీ ఉద్యోగులపై తప్పుడు గ్రీవెన్స్‌ ఫిర్యాదులు చేయిస్తూ డబ్బులు డిమాండ్‌

విచారణ అధికారిగా సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ డీడీ శోభారాణి నియామకం

కార్పొరేషన్‌(కాకినాడ), సెప్టెంబరు 15(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లాలో జిల్లా పంచాయతీ శాఖలో పనిచేస్తున్న పలువురు ఎస్సీ, బీసీ ఉద్యో గులపై తప్పుడు గ్రీవెన్స్‌ ఫిర్యాదులు చేయిస్తూ ఆ ఫిర్యాదులు క్లోజ్‌ చేయడానికి సదరు ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరో పణలపై కాకినాడ డీఎల్‌పీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో సీహెచ్‌ వెంకటరెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై డీఆర్వో జె.వెంకట్రావు విచారణకు ఆదేశించారు. దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కోఆర్డినేటర్‌ పి.చంగలరావు ఆధ్వర్యంలో పలు దళిత గిరిజన సంఘాల నాయకులు ఈ విషయంపై సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. చంగలరావు మాట్లాడుతూ యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీకి సుమారు 3 నెలల క్రితం సియోన్‌కుమార్‌ అనే ఎస్సీ కులానికి చెందిన పంచాయ తీ కార్యదర్శిని ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నియమించడం జరిగిందన్నారు. అతను తమకు తెలిసినంత వర కు ఎంతో బాధ్యతగా పంచాయతీ శాఖ నిబంధనలకు లోబడి విధులను నిర్వహిస్తున్నాడన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పంచాయతీ సేవలను అందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పొన్నాడ పంచాయతీకి సంబంధంలేని నాగులాపల్లి, కొండెవరం పంచాయతీలకు చెందిన బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, వాసంశెట్టి శ్రీను అకారణంగా అసత్య ఆరోపణలతో తరచుగా జిల్లా కలెక్టర్‌కి పీజీఆర్‌ఎస్‌లో సియోన్‌కుమార్‌ను బదిలీ చేయాలని ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ విషయం పై సియోన్‌కుమార్‌ను అడగ్గా తనకు ఏ సమా చారం లేదని వారెవరో ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో తెలియదని చెప్పాడన్నారు. దీనిపై కొంచెం లోతుగా సమాచారం సేకరించగా కాకినాడ డీఎ ల్‌పీవో ఆఫీసులో ప్రస్తుతం ఏవోగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్‌ వెంకటరెడ్డి ఇద్దరితో ఫిర్యాదు చేయించాడని తెలిసిందన్నారు. గతంలో కూడా వెంకటరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. 12వ ఆర్థిక సంఘం ని ధుల తాలూకా వడ్డీని తన ఖాతాకు మళ్లించుకున్నాడని, అతడి సర్వీసులో ఉండగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఉద్యోగం ఇప్పిం చే విషయంలో బెనిఫిట్స్‌ ఇచ్చే విషయంలో మహిళలను కావాలనే ఉద్దేశపూర్వకంగా తన చుట్టూ తిప్పుకుంటూ నచ్చినవారిపై లైంగిక వేధి ంపులు కూడా చేస్తుంటాడని తెలిసిందన్నారు. ఎస్సీ, బీసీ ఉద్యోగులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారన్నారు. సీహెచ్‌ వెంకటరెడ్డి, అతడి అను చరులు బిళ్లకుర్తి రామేశ్వరెడ్డి, వాసంశెట్టి శ్రీనివాస్‌లపై డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీ జరిపించాలన్నారు. వెంకటరెడ్డిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై డీఆర్‌వో జె.వెంకటరావుకు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన ఆయన సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శోభారాణిని విచారణ అధికారిణిగా నియమించారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షడు సిద్దాంతుల కొండబాబు, జై భీమ్‌రావు భారత్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ ఏనుగుపల్లి కృష్ణ, బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:42 AM