Share News

బస్సు ఆపమని...కాలువలోకి దూకిన ఇంటర్‌ విద్యార్థిని

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:35 AM

ఉండ్రాజవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని మంగళవారం సాయంత్రం దమ్మెన్ను కాలువలోకి దూకిం ది. గ్రామానికి చెందిన కొప్పుల పూజిత మండలంలోని ఓ ప్రయివేటు జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియ

బస్సు ఆపమని...కాలువలోకి దూకిన ఇంటర్‌ విద్యార్థిని

పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం గాలింపు

లభ్యం కాని ఆచూకీ

ఉండ్రాజవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని మంగళవారం సాయంత్రం దమ్మెన్ను కాలువలోకి దూకిం ది. గ్రామానికి చెందిన కొప్పుల పూజిత మండలంలోని ఓ ప్రయివేటు జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఉదయం యఽథావిధిగా కాలేజీకి వెళ్లి తిరిగి బస్సులో సాయంత్రం ఇంటికి వస్తుండగా దమ్మెన్ను కాలువ వంతెనపైకి రాగానే తనకు వాంతులు అవుతున్నాయని, బస్సును ఆపమని చెప్పి దిగిన వెంటనే ఒక్కసారిగా వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. దీంతో తోటి విద్యార్థి తమ కళ్లెదుటే కాలువలోకి దూకేయడంతో విద్యార్థులు దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే స్థానికులు రక్షిద్దామని ప్రయత్నించినప్పటికీ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొట్టుకుపోయింది. సంఘట న తెలిసిన వెంటనే ఉండ్రాజవరం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం గాలింపు చేపట్టారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి విడాకులు తీసుకుని వేర్వేరుగా తీసుకుని జీవిస్తున్నారు. పూజితకు అక్క, అన్నయ్య ఉన్నారు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ దేవకుమార్‌, నిడదవోలు సీఐ తిలక్‌ పరిశీలించా రు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - Oct 08 , 2025 | 12:35 AM