Share News

స్ఫూర్తి ప్రదాత గౌతు లచ్చన్న

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:51 AM

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన సర్దార్‌ గౌతు లచ్చ న్నను స్ఫూర్తిగా తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థా నిక వై-జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి దుర్గేష్‌, మాజీ ఎంపీ మార్గాని భరత్‌, సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్‌, రెడ్డి రాజు, సూరంపూడి శ్రీహరి, మార్గాని చంటిబాబు, రెడ్డి మణి,డాక్టర్‌ అన సూరి పద్మలత, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ తదితర ప్రముఖులు నివాళులర్పించారు.

 స్ఫూర్తి ప్రదాత గౌతు లచ్చన్న
గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి దుర్గేష్‌

  • వర్థంతి కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం కల్చరల్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన సర్దార్‌ గౌతు లచ్చ న్నను స్ఫూర్తిగా తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థా నిక వై-జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి దుర్గేష్‌, మాజీ ఎంపీ మార్గాని భరత్‌, సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్‌, రెడ్డి రాజు, సూరంపూడి శ్రీహరి, మార్గాని చంటిబాబు, రెడ్డి మణి,డాక్టర్‌ అన సూరి పద్మలత, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్‌ మాట్లాడుతూ లచ్చన్న తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో లోడా అప్పారావు, జనసేన సిటీ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, బీ జేపీ జిల్లా మోర్చా అధ్యక్షురాలు మొన్నే ఉమాదేవి, బొమ్ముల దత్తు, గేడి అన్నపూర్ణరాజు, కోడి ప్రవీణ్‌కుమార్‌, అత్తిలి రాజు పాల్గొన్నారు. స్థానిక గోదావరి గట్టున ఐన్‌టీయూసీ జిల్లా అధ్య క్షుడు వాసంశెట్టి గంగాధర్‌ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కుడుపూడి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విచ్చేసి లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ లాలాచెరువు జంక్షన్‌లో గౌతు లచ్చన, పాపన్న గౌడ్‌, కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వాసంశెట్టి గంగాధరరావు, బీజేపీ జిల్లా అధ్య క్షుడు పిక్కి నాగేంద్ర, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:51 AM