Share News

రాజమహేంద్రిలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - May 21 , 2025 | 12:15 AM

రాజమహేంద్రవరం ప్రజలందరికీ ఆధునాతన మల్టీస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు, ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులను ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు.

రాజమహేంద్రిలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌
ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ కేతన్‌

  • త్వరలో అందుబాటులోకి..

  • మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

  • ఐదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

  • పనులు, క్రీడా సామగ్రి పరిశీలన

రాజమహేంద్రవరం సిటీ, మే 20( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రజలందరికీ ఆధునాతన మల్టీస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు, ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులను ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్రీడా సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరో ఐదురోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. దాదాపు రూ4.30 కోట్ల వ్యయంతో సకల సదుపాయాలతో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించుకుంటున్నామన్నారు. ఇందులో షూటింగ్‌, స్నూకర్‌(బిలియర్డ్స్‌), టేబుల్‌ టెన్నీస్‌, చెస్‌, క్యారమ్స్‌తో పాటు లేటెస్ట్‌ ఎక్విప్‌మెంట్‌తో జీమ్‌ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కమిషనర్‌ చెప్పా రు. నగరంలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు కొత్తగా నిర్మించిన మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఎంతగానో దోహద పడుతుందన్నారు. రాజమహేంద్రవరంలో క్రీడలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వెంట కార్పొరేషన్‌ ఎస్‌ఈ ఎంసీహెచ్‌ కోటేశ్వరరావు, ఈఈ రీటా, ఇతర సిబ్బంది ఉన్నారు.

  • పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా జరగాలి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరగాలని అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో డ్రైనేజీల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా పూడిక తొలగించాలని, ప్రతి రోజు ఇంటిం టా చెత్తసేకరణ జరగాలని, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను డంపింగ్‌యార్డుకు తరలించాలని, తడి, పొడి చె త్త వేర్వేరుగా సేకరించాలన్నారు. ఉదయం 7గం టలకు ఇంటింటా చెత్తసేకరణ ప్రారంభం కావాలన్నారు. రోజూ పారిశుధ్య కార్మికులు ఎంత మంది విధులకు వస్తున్నదీ రికార్డులు ఉండాలన్నారు. రాత్రిపూట పనిచేసే సిబ్బంది రేడియం యాప్రాన్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. రా నున్న వర్షాకాలం దృష్ట్యా కార్మికులకు రెయిన్‌ కోట్లు కూడా అందజేస్తామని అడిషనల్‌ కమిషనర్‌ అన్నారు. వీటితో పాటు తమ తమ పరిధి లో ఎన్ని అపార్టుమెంట్లు ఉన్నవి, వాటిలో హోం కంపోస్టింగ్‌ చేస్తున్న అపార్టుమెంట్లను గుర్తించాలన్నారు. దోమల నివారణకు యాంటి లార్వా ఆపరేషన్‌ డ్రైవ్‌ను ప్రతిరోజు నిర్వహించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎం హెచ్‌లో డాక్టర్‌ వినూత్న, శానిటరీ సూపర్‌ వై జర్లు, ఇన్స్‌పెక్టర్లు, బయాలజిస్ట్‌లు, సచివాయల సిబ్బంది, శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:15 AM