Share News

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..

ABN , Publish Date - May 25 , 2025 | 11:50 PM

ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవు. అందుకు ఉదహరణగా నిలిచారు ఈ దంప తులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన తుమ్మల అ

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..
వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి దంపతులు

ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవు. అందుకు ఉదహరణగా నిలిచారు ఈ దంప తులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన తుమ్మల అభి గత పదేళ్లుగా అమెరికాలోని సియోటెల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న కింబర్లీ అనే యువతితో పరిచయడం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో అబ్బాయి స్వగ్రామం పులిమేరులో ఆదివారం వారి వివాహం దీనిని హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అమెరికా అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి వివాహ వేడుకను చూసే ందుకు జనం తరలివచ్చారు. డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి హాజరై జంటను ఆశీర్వదించారు.

పెద్దాపురం (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 25 , 2025 | 11:50 PM