Share News

జయహో

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:02 AM

ఆంధ్ర ప్రదేశ్‌ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అడుగులు వేస్తున్నాం... అభి వృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం..

జయహో
జెండా వందనం చేస్తున్న మంత్రి దుర్గేష్‌ చిత్రంలో కలెక్టర్‌ ప్రశాంతి

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యం

కూటమి పాలన సూపర్‌ హిట్‌

జెండా వందనంలో మంత్రి దుర్గేష్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 15 (ఆంధ్ర జ్యోతి) : ఆంధ్ర ప్రదేశ్‌ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అడుగులు వేస్తున్నాం... అభి వృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం.. పీ4లో భాగంగా మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసం ధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌ స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్‌ కాలేజీలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాలను వరుసగా అమలు చేస్తున్నామన్నా రు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత ప్రయాణ పథకాలు అమలు చేశామన్నారు. యు వతకు 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు రూ.1500 ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ భరోసా కింద 17 కేటగిరీల్లో పింఛన్లు అందిస్తున్నా మ న్నా రు. జిల్లాలో ఐదు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నామన్నారు.అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో తొలి విడతగా లక్షా 14 వేల 991 మంది రైతులకు రూ. 57 కోట్ల 50 లక్షలు, పీఎం కిసాన్‌ కింద 20వ విడతలో లక్షా 3 వేల 834 మందికి రూ.20 కోట్ల 76 లక్షలు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసి నట్టు చెప్పారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద 17 కేటగిరీల్లో 2 లక్షల 36 వేల 331 మందికి ప్ర నెలా 1న రూ. 103కోట్ల 26 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యాశాఖ ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అమలు చేస్తున్నా మన్నారు. జిల్లాలో అఖండ గోదావరి పథకం కింద రూ.94.44 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నామన్నారు. రాజానగరం మండలం కలవచర్లలో 104 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పారి శ్రామిక పార్కు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పుష్కరాలకు రుడా ద్వారా రూ.5.52 కోట్లతో రాజమహేంద్రవరంలో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు.జిల్లాలో గనుల శాఖ ద్వారా ఇప్పటి వరకూ 36 లక్షల 24 వేల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచి తంగా సరఫరా చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నా మన్నారు.కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధి చేస్తున్నా మన్నా రు.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను సత్కరిం చారు.కా ర్యక్రమంలో ఎమ్మె ల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బల రామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,జేసీ చిన్నరాము డు, ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ అధికారులు 437

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 70 మంది జిల్లా అధికారులు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాల్లో 437 మంది వివిధ కేడర్ల అధికారులు,ఉద్యోగులకు మంత్రి కందుల దుర్గేష్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌, జేసీ చిన్నరాముడు ప్రశంసాపత్రాలు అందజేశారు.

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : వివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాతుకు పరేడ్‌ కమాండర్‌గా డీఏఆర్‌ టీవీర్‌కే కుమార్‌ నాయకత్వం వహించారు. కవాతులో సన్మాన్‌ గార్డ్‌, సివిల్‌ పురుషులు, ట్రాఫిక్‌, సివిల్‌ మహిళలు, హోం గార్డులు, ఎన్‌సీసీ బాలికలు, యువ రెడ్‌క్రాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ బాలురు వంటి 8 దళాలు పాల్గొన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏపీఈపీడీసీఎల్‌ (విద్యుత్‌ సంస్థ)శకటం ప్రథమ, వ్యవసాయం అండ్‌ హార్టికల్చర్‌ ద్వితీయ, సాంఘిక సంక్షేమశాఖ శకటం తృతీయ, పశుసంవర్థకశాఖ శకటం నాలుగో స్థానం, పర్యాటకశాఖ శకటం ఐదో స్థానం సాధించాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 70 మంది జిల్లా అధికారులు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాల్లో 437 మంది వివిధ కేడర్ల అధికారులు,ఉద్యోగులకు మంత్రి కందుల దుర్గేష్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌, జేసీ చిన్నరాముడు ప్రశంసాపత్రాలు అందజేశారు.

కన్నుల పండువగా..

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంగన్వాడీ చిన్నారుల ఫ్యాషన్‌ డ్రెస్‌ కాంపిటీషన్‌ ఆకట్టుకుంది. ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ విద్యార్థులు జయం మనదే అంటూ నృత్య ప్రదర్శన చేశారు. ప్రభుత్వ సంగీత కళాశాల, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, గౌతమి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, ఆనందనగర్‌, లాలాచెరువు మునిసిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు దేశభక్తి స్ఫూర్తి ప్రదర్శనలు చేశారు. సంక్షేమ శకటంతో పాటు వచ్చిన వారు గిరిజన నృత్యం చేస్తుండగా మంత్రి దుర్గేష్‌ వారితో జతకలిశారు. కొద్దిసేపు థింసా నృత్యానికి అడుగుల వేశారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో శ్రీ గౌతమి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ప్రథమ, ఆనందనగర్‌ మునిసిపల్‌ స్కూల్‌ ద్వితీయ, ట్రిప్స్‌ స్కూల్‌ తృతీయ స్థానంలో నిలిచాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శన స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

పల్లెకు స్వచ్ఛ రథం!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : పల్లెల్లో పెరుగుతున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ రథం కార్యక్రమం ఒక మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్సులో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో స్వచ్ఛ రథం వాహనాలను కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అందరం కలిసికట్టుగా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛ రథం రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో ఇంటింటా తిరుగుతూ గృహాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటికి ప్రత్యామ్నాయంగా స్నానం సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, నూనె ప్యాకెట్లు, ఉల్లిపాయలు వంటి సరుకులను అందజేస్తారన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 01:02 AM