Share News

ఆదాయం డీలా..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:22 AM

గడిచిన ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేకపో యింది. అంతకు ముందు ఏడాదితో పోల్చినా తక్కువగానే రాబడి సమకూరింది. వాస్తవా నికి గత ఏడాది నవంబరు నుంచీ రిజిస్ట్రేష న్లు నెమ్మదిస్తూ వచ్చాయి.

 ఆదాయం డీలా..

లక్ష్యం రూ.701కోట్లు.. రాబడి రూ.472 కోట్లు 8 రూ.299 కోట్లు తగ్గుదల

డాక్యుమెంట్ల సంఖ్యలోనూ తగ్గుదల

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గడిచిన ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేకపో యింది. అంతకు ముందు ఏడాదితో పోల్చినా తక్కువగానే రాబడి సమకూరింది. వాస్తవా నికి గత ఏడాది నవంబరు నుంచీ రిజిస్ట్రేష న్లు నెమ్మదిస్తూ వచ్చాయి. అయినప్పటికీ సరైన దిద్దుబాటు చర్యలు కొరవడడం, మరో వైపు రియల్‌ ఎస్టేట్‌ పడకేయడం వెరసి రిజి స్ట్రేషన్ల ఆదాయం లక్ష్యానికి 32 శాతం దూరం లో ఆగిపోయింది. జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదా యంలో ముందు వరుసలో ఉండే రాజమ హేంద్రవరం, రాజానగరం, కడియం, పిడిం గొయ్యి కూడా నిరాశపరచగా అనంతపల్లి కాస్త మెరుగ్గా 92శాతం టార్గెట్‌ పూర్తిచేసింది.

రాబడికి గండి

తొలుత 2023-24 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2024-25 ఆదాయం కాస్త మెరుగైనా లక్ష్యానికి మాత్రం చాలా దూరంలోనే ఉంది. అనంత పల్లి మినహా ఏ రిజిస్ట్రారు కార్యాలయమూ 80 శాతానికి చేరువకాలేదు. ఈ ఏడాది మా ర్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్స రంలో మాత్రం డాక్యుమెంట్ల సంఖ్యలోనూ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే భారీ గా తగ్గుదల నమోదైంది. 2023-24, 2024 -25కి ఏకంగా లక్ష డాక్యుమెంట్లు తగ్గాయి. 2024-25కి వచ్చేసరికి రూ.701కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా కేవలం రూ.472కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. రూ.229 కోట్లు ఆదా యంలో కోతపడింది. జిల్లాలో అధిక ఆదా యం ఆర్జించే రాజమహేంద్రవరం లక్ష్యానికి రూ.73 కోట్లు దూరంగా ఆగిపోయింది. వేగే శ్వరపురం 50శాతం కూడా చేరుకోలేదు. రిజి స్ట్రేషన్ల ఆదాయం బాగా పడిపోతోందని గతం లోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించడం గమనా ర్హం. 2023-24 ఏడాది ఎన్నికల సంవత్సరం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల పం దేరం యథేచ్ఛగా జరిగిన సంగతి తెలిసిందే. వేల ఎకరాల్లో చుక్కల భూములను ఫ్రీహో ల్డు చేశారు. వాటిలో చాలా మటుకు వైసీపీ నాయకులే రిజిస్ట్రేషను చేయించుకున్నారని తెలుస్తోంది. చివరి ఏడాది మరీ దారుణంగా భూములపై కోరలు చాచడంతో రిజిస్ట్రేషను శాఖకు బాగా ఆదాయం సమకూరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఏడా ది 78.38 శాతం టార్గెట్‌ పూర్తి చేసింది.

ఎస్‌ఆర్‌వో 2023-24 (రూ.కోట్లలో) 2024-25 (రూ.కోట్లలో)

లక్ష్యం రాబడి డాక్యుమెంట్లు లక్ష్యం రాబడి డాక్యుమెంట్లు

అనపర్తి 20.56 16.05 8302 23.19 17.48 4640

అనంతపల్లి 27.58 20.20 12650 31.66 29.20 9370

బిక్కవోలు 28.07 15.47 12221 26.44 20.63 5692

కడియం 57.44 36.29 14593 59.55 38.46 7929

కోరుకొండ 25.82 19.95 15671 32.03 16.87 6612

కొవ్వూరు 47.72 37.89 22170 57.59 43.54 11954 నిడదవోలు 38.55 28.18 18562 44.88 30.14 9526

పిడింగొయ్యి 70.89 45.59 10905 71.65 51.09 5853

రాజమండ్రి 150.78 149.44 29196 230.34 157.20 17513

రాజానగరం 89.56 67.83 19334 94.21 51.48 10963

సీతానగరం 9.90 6.78 6546 9.82 7.17 3060

వేగేశ్వరపురం 16.46 13.39 9386 20.03 9.45 4579

మొత్తం 583.13 457.06 179536 701.39 472.71 97691

ఇటీవల బీసీ, కాపు కార్పొరేషన్‌ రుణాల కోసం

Updated Date - Apr 10 , 2025 | 01:22 AM