అయినవిల్లి ఆదాయం రూ.66.68 లక్షలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:10 AM
అయినవిల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయంలోని హుండీల్లో కాను కలను మంగళవారం
శ్రీసిద్ధివినాయక ఆలయంలో కానుకల లెక్కింపు
అయినవిల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయంలోని హుండీల్లో కాను కలను మంగళవారం లెక్కించారు. వినాయక చవితి మహోత్సవాలు ఆగస్టు 27 నుంచి ఈనెల 4 వరకు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు లక్షా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా వివిధ టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.43,58,204 ఆదాయం వచ్చింది. ప్రత్యేక అభిషేకాలు 2737, టిక్కెట్ల ద్వారా రూ.6. 84లక్షలు, హుండీల ఆదాయం రూ.15,75,149, ఉత్సవ పందిరి హుండీ రూ.28, 133, అన్నదానం హుండీ రూ.22, 521 ఆదాయం రాగా మొత్తం ఉత్సవాల ఆదాయం రూ.66, 68,225 వచ్చినట్టు ఆలయ సహాయ కమిషనర్ అల్లు దుర్గాభవానీ తెలిపారు. గతేడాది ఉత్సవాల ఆదాయం రూ.51, 51,788 వచ్చిందని చెప్పారు.