శ్రీసిద్ధివినాయకుడి హుండీల ఆదాయం రూ.44.11 లక్షలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:10 AM
అయినవిల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయకుడి హుండీలను మంగళవారం లెక్కించారు. 90 రోజులకు ఆలయ ప్రధాన హుండీ నుంచి రూ.42,81,1787, అన్న ప్రసాద హుండీ నుంచి రూ.1,30,115 వెరసి మొత్తం రూ.44,11,902 నగదు, 173 గ్రాముల వెం
అయినవిల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీసిద్ధివినాయకుడి హుండీలను మంగళవారం లెక్కించారు. 90 రోజులకు ఆలయ ప్రధాన హుండీ నుంచి రూ.42,81,1787, అన్న ప్రసాద హుండీ నుంచి రూ.1,30,115 వెరసి మొత్తం రూ.44,11,902 నగదు, 173 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు 33 వచ్చినట్టు ఆలయ సహాయ కమిషనర్ అల్లు వెంకటదుర్గాభవానీ పేర్కొన్నారు. తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు, ట్రైనింగ్ సహాయ కమిషనర్ ఎం.మంజులాదేవి, జిల్లా దేవాదాయశాఖాధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. అర్చకులు, గ్రామస్తులు, ఆలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.