Share News

గిట్టుబాటు ధర కల్పిస్తే రైతుకు కష్టాలుండవు

ABN , Publish Date - May 11 , 2025 | 11:49 PM

రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టపడతాడని, ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కష్టాలు ఉండవని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయ న మాధవరాయుడుపాలెం సర్పంచ్‌ అన్నందేవుల చంటి సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.

గిట్టుబాటు ధర కల్పిస్తే రైతుకు కష్టాలుండవు
లక్ష్మీనారాయణకు నాగలి, వరికంకుల కుచ్చును అందజేస్తున్న చంటి

  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

కడియం, మే 11(ఆంధ్రజ్యోతి): రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టపడతాడని, ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కష్టాలు ఉండవని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయ న మాధవరాయుడుపాలెం సర్పంచ్‌ అన్నందేవుల చంటి సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. చంటి, తనయుడు కృష్ణ ఆయనకు మొక్కను అందించి స్వాగతించారు. అలానే నాగలిని, వరికంకుల కుచ్చును అందజేశారు. 1931లో చంటి పూర్వీకులు కట్టి ంచిన ఇంటిని ఇటీవల అధునాతంగా తయా రుచేశారు. ఆ ఇంటిని లక్ష్మీనారాయణ చూశా రు. అనంతరం గ్రామంలో గొంతాలమ్మ, ఆం జనేయస్వామి, రామాలయాలతోపాటు ఓం శాంతి ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం చంటి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రకృతి వ్యవసాయం వైపు ఆలోచన చేయాలన్నారు. తాను మూడేళ్ల పాటు ధర్మవరం వద్ద 12 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేశానన్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:49 PM