Share News

పరిమితి మించితే.. ఆటో సీజ్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:13 AM

నిబంధనలు అతిక్రమించే స్కూల్‌ బస్సులు, ఆటోలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి ఆర్‌.సురేష్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ రెగ్యులర్‌గా తనిఖీలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరిమితికి మించి స్కూల్‌ పిల్లలను తరలిస్తున్న ఆటోలపై రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. జిల్లా రవాణాఅధికారి ఆదేశాల మేరకు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం రాజమహేంద్రవరం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఆటోల తనిఖీలు నిర్వహించారు.

పరిమితి మించితే.. ఆటో సీజ్‌
మోరంపూడి వద్ద ఆటోను తనిఖీ చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి

  • స్కూల్‌ పిల్లలను తరలించే వాహనాలపై డీటీవో దాడులు

  • 4 సీజ్‌, 16 ఆటోలపై కేసులు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు అతిక్రమించే స్కూల్‌ బస్సులు, ఆటోలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి ఆర్‌.సురేష్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ రెగ్యులర్‌గా తనిఖీలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరిమితికి మించి స్కూల్‌ పిల్లలను తరలిస్తున్న ఆటోలపై రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. జిల్లా రవాణాఅధికారి ఆదేశాల మేరకు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం రాజమహేంద్రవరం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఆటోల తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా స్కూల్‌ పిల్లలను తరలించే ఆటోలపై దృష్టి పెట్టారు. నిబంధనలను అతిక్రమించిన 4 ఆటోలను సీజ్‌ చేయడంతో పాటు 16 ఆటోలపై కేసులు రాశారు. సుమారు రూ.70,000 పెనాల్టీగా విఽఽధించారు. మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు జి.రాధికాదేవి, కె.చైతన్యసుమ తమ సిబ్బందితో ఈ తనిఖీలు జరిపారు.

Updated Date - Mar 12 , 2025 | 01:14 AM