భవన నిర్మాణాలకు, ప్లానింగ్‌కు వ్యత్యాసముంటే చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:09 AM
రాజమహేంద్రవరంలో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు, వాటి ప్లానింగ్‌కు మధ్య వ్యత్యాసం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అఽధికారులకు కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదే శించారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని విద్యానగర్, వీవర్స్ కాలనీ, తాడితోటలోని కరుణశ్రీ ఆసుపత్రి, జేఎన్ రోడ్డులోని సాల్ట్ హోటల్, ఏవీఏ రోడ్డులోని పాంటలూన్స్ సహ పలు భవనాలను ఆమె పరిశీలించారు.
రాజమహేంద్రవరంలో పలు భవనాలను పరిశీలించిన ఇన్‌చార్జి కమిషనర్
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 24(ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవరంలో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు, వాటి ప్లానింగ్‌కు మధ్య వ్యత్యాసం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అఽధికారులకు కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదే శించారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని విద్యానగర్, వీవర్స్ కాలనీ, తాడితోటలోని కరుణశ్రీ ఆసుపత్రి, జేఎన్ రోడ్డులోని సాల్ట్ హోటల్, ఏవీఏ రోడ్డులోని పాంటలూన్స్ సహ పలు భవనాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాన్లకు, నిర్మాణాలకు తేడాలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సచివాలయ పరిపాలన కా ర్యదర్శులు ఉదయం 8నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి అండర్ అసెస్మెంట్, ఖాళీ స్థలాలను గుర్తించి పన్ను విధించాలని ఆదేశించారు. ఇందుకు పూర్తి బాధ్యత అడ్మిన్ సెక్రటరీలు, ఆర్‌ఐలు వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే సచివాలయాల వారీగా పురోగతి పై రోజూ వారి నివేదికలను అందించాలని ఆదే శించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డీసీ ఎస్.వెంకటరమణ, సీహెచ్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.