Share News

మహనీయుల విగ్రహాలు భావి తరాలకు స్ఫూర్తి

ABN , Publish Date - May 19 , 2025 | 12:50 AM

మహనీయుల విగ్రహాలు భవిష్యత్‌ తరా లకు స్ఫూర్తినిస్తాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక వీఎల్‌ పురం సెంటర్‌లో వెల మ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం వెల మ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొబ్బిలి పులిగా చరిత్ర గాంచిన తాండ్ర పాపారాయుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవా ధ్యక్షుడు చల్లా శంకర్రావులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

మహనీయుల విగ్రహాలు భావి తరాలకు స్ఫూర్తి
విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వాసు, ఆదిరెడ్డి అప్పారావు

  • తాండ్ర పాపారాయుడు, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణలో ఎమ్మెల్యే వాసు

రాజమహేంద్రవరం సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): మహనీయుల విగ్రహాలు భవిష్యత్‌ తరా లకు స్ఫూర్తినిస్తాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక వీఎల్‌ పురం సెంటర్‌లో వెల మ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం వెల మ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొబ్బిలి పులిగా చరిత్ర గాంచిన తాండ్ర పాపారాయుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవా ధ్యక్షుడు చల్లా శంకర్రావులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విగ్రహావిష్కరణ ని రాడంబరంగా చేసినప్పటికీ ఎర్ర న్నాయుడి జయంతి, వర్ధంతులు పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. త్వరలో నగరం లో ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీలంతా కలిసి మెలిసి వుంటారని అందుకే తన తల్లి మేయర్‌, తండ్రి ఎమ్మెల్సీ, భార్య ఎమ్మెల్యేగా చేసినా, ఇప్పుడు తాను ఎమ్మెల్యే చేసినా వారి అభిమా నం వల్లనే నన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు వల్లనే వాసు రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. కార్యక్రమంలో వెల మ సంఘం నగర అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్‌, కోళ్ల బాబు, సప్పా వెంకటరమణ, చల్లా బాలమురళీకృష్ణ, కొల్లిబుజ్జి, వాసిరెడ్డి బాబి, అల్లు బాబి, వాసిరెడ్డి కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:50 AM