రజకుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:08 AM
రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి ప్రత్యేక కాలనీ ఏ ర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 16వ డివిజన్‌లో రూ.17.70 లక్షల వ్యయంతో చేపట్టిన గౌతమి దోబిఖాన ఆధు నీకరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే గోరంట్ల
16వ డివిజన్‌లో దోబిఖానా ఆధునీకరణకు శంకుస్థాపన
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 4( ఆంధ్రజ్యోతి): రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి ప్రత్యేక కాలనీ ఏ ర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 16వ డివిజన్‌లో రూ.17.70 లక్షల వ్యయంతో చేపట్టిన గౌతమి దోబిఖాన ఆధు నీకరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలి దోబిఖాన ఇదేనని,తన హయాంలోనే దానిని నిర్మించామన్నారు. పైప్‌లైన్ పాడై నీరు సరిగా అందడంలేదని, దాంతో దోబీఖానను ఆధునీకరిస్తున్నామని, మరో బోరు వేయిస్తామన్నారు. అలాగే జంగిల్ క్లియరెన్స్ చేయించా లన్నారు. తొలుత స్థానిక యూపీహెచ్‌సీలో స్వీయ నిధులతో వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. టీబీ రోగులకు పౌష్టికాహారం నిమిత్తం రూ.30 వేలు అందజేశా రు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టూరి జం, శాలివాహన కార్పొరేషన్ల డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, దాలిపర్తి వేమన, జిల్లా వైద్యాధికారి వసుంధర, డాక్టర్ వినీత, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచే హనుమంతరావు, చలమూరి సత్య నారాయణ, శీలం గోవిందు పాల్గొన్నారు.