అనుమానమే పెనుభూతమై...
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:03 AM
కాకినాడ రూరల్, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): భార్యపై అనుమానంతో మద్యం మత్తులో తలపైన గచ్చుపలకరాయితో భ ర్త గట్టిగా కొట్టడంతో మరణించిన సంఘటన ఇంద్రపాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండ లం
గచ్చుపలకరాయితో కొట్టి భార్యను చంపి పరారైన భర్త
ఇంద్రపాలెంలో సంఘటన
కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు
కాకినాడ రూరల్, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): భార్యపై అనుమానంతో మద్యం మత్తులో తలపైన గచ్చుపలకరాయితో భ ర్త గట్టిగా కొట్టడంతో మరణించిన సంఘటన ఇంద్రపాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండ లం ఇంద్రపాలెంలోని పిల్లకాలువ రోడ్డులో గల గొల్లపేట 2వ వీధిలోని ఓ ఇంట్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడికి చెందిన బేతా మల్లేశ్వరి(47), గంగరాజు దంపతులు అద్దెకు ఉంటున్నారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. కుమార్తెకు వివాహం కావడంతో స్వామినగర్‌లో వారు నివసిస్తున్నారు. కుమారుడు గణేష్ మెకానిక్‌గా పనిచేస్తూ తల్లి దండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే కొది ్దరోజులుగా దంపతుల మధ్యగొడవలు జరుగుతు న్నాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. మద్యంమత్తులో ఉన్న గంగరాజు భార్యపై అనుమానంతో తలపైన గచ్చుపలకరాయితో గట్టిగా కొట్టడంతో ఆమె మరణించింది. తర్వాత భర్త తన సెల్‌ఫోన్, చెప్పులు, దుస్తులను ఇంట్లోనే వదిలేసి పరారయ్యా డు. అపస్మారకస్థితిలో ఉన్న తల్లిని కొడుకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సీఐ చైతన్యకృష్ణ, ఇంద్ర పాలెం ఎస్‌ఐ ఎం.వీరబాబు సోమవారం సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించి మృతురాలి కు టుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించగా క్లూస్ టీమ్ పరిశీలించింది. మార్చురీలో ఉన్న మల్లీశ్వరి మృతదేహాన్ని కుటుంబసభ్యు ల కు అప్పగించారు. మల్లేశ్వరి కొడుకు గణేష్ ఫి ర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.