Share News

అనుమానం పెనుభూతమై...

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:39 AM

కాకినాడ రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో కత్తితో పీక కోసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో జరిగింది. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చీపు రుపల్లి దేవి (34), చీపురుపల్లి రా

అనుమానం పెనుభూతమై...
కాకినాడలో చికిత్స పొందుతున్న దేవి, రాజేష్‌ మృతదేహం

కత్తితో భార్య పీక కోసిన భర్త

అనంతరం పురుగులమందు తాగి పీక కోసుకుని ఆత్మహత్య

కాకినాడ జిల్లా తూరంగిలో ఘటన

కాకినాడ రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో కత్తితో పీక కోసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో జరిగింది. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చీపు రుపల్లి దేవి (34), చీపురుపల్లి రాజేష్‌(36) దంపతులు. 13ఏళ్ల కుమార్తె, 8ఏళ్ల కొడుకుతో కలిసి కర్ణాటకలోని సింధునూరులో నాలుగేళ్లుగా నివసిస్తున్నారు. ఇటీవల దీపావళి పండుగకు కాకినాడ జిల్లా తూరంగిలోని అత్తారింటికి వచ్చారు. భర్త తన సొంతూరు కాజులూరు మండలం శీల వెళ్లాడు. ఈనెల 4న దేవి అక్క కొడుకు, చెల్లితో కలిసి కాకినాడ కుళాయిచెరువు పార్కుకు వెళ్లారు. అక్కడ దేవి తనకు బావ వరసున్న వ్యక్తితో మా ట్లాడుతుండగా ఆమె మరిది చూసి తన అన్న రాజేష్‌తో చెప్పాడు. దీంతో శుక్రవారం శీల నుంచి తూరంగి ఏఎస్‌ఆర్‌ కాలనీలోని అ త్తారిం టికి బియ్యంమూటను తీసుకొచ్చిన రాజేష్‌ భా ర్యను ఆ విషయంపై నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో తన వద్ద ఉన్న కత్తితో పీకపై కోశాడు. అనంతరం రాజేష్‌ రాత్రి 7గంటల సమయంలో తాళ్లరేవు మండలం పటవల పొలాల్లోకి వెళ్లి పురుగులమందు తాగి అనంతరం తన వద్ద ఉన్న కత్తితో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. దేవికి పీక వద్ద నుంచి భుజంవరకూ తీవ్రమైన గాయం కావడంతో ఆమె తల్లి వెంట నే కాకినాడ జీజీహెచ్‌కు తరలించింది. ప్రస్తుతం చికిత్స పొందుతుందని, ఆమె స్టేట్‌మెంట్‌ ప్రకా రం కేసు నమోదు చేసినట్టు ఇంద్రపాలెం ఎస్‌ఐ వీరబాబు పేర్కొన్నారు. దేవి తండ్రి కుడుపూడి వీరవెంకటసత్యనారాయణ కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉద్యోగి. ఆయనకు ముగ్గురు కుమార్తెలుండగా దేవి మూడో సంతానం.

Updated Date - Nov 08 , 2025 | 01:39 AM