Share News

దంపతుల దారుణ హత్య

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:48 PM

నల్లజర్ల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘం టావారిగూడెంలో బుధవారం అత్తమామల ను అత్యంత కర్కశంగా అల్లుడు

దంపతుల దారుణ హత్య
సంఘటనా స్థలాన్ని పరిశీల్తిసున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌

హంతకుడు అల్లుడే

కత్తితో నరికేసిన వైనం

తప్పించుకున్న భార్య

తూర్పుగోదావరి జిల్లా ఘంటావారిగూడెంలో ఘటన

నల్లజర్ల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘం టావారిగూడెంలో బుధవారం అత్తమామల ను అత్యంత కర్కశంగా అల్లుడు కత్తితో నరికి చంపిన వైనమిది. ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన ఏకుల బాబురావు(55), శారద(50) దంపతులకు నాగే శ్వరి, అప్పారావు సంతానం. నాగేశ్వరికి ఏలూరు జిల్లా దెందు లూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన మారిది కోటేశ్వరరావుతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి లోకేష్‌, గిరీష్‌ ఇద్దరు కుమారులు. నాగేశ్వరికి భర్తతో ఏడాది కిందట విభేదాలు రావడంతో అత్తింటి నుంచి పుట్టింటికి ఇద్దరు కుమారులతో వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. గత నెల భర్త కోటేశ్వరరావు వచ్చి అందరినీ చంపేస్తానని బెదిరించడం తో ఇరుగుపొరుగు వారిని పిలవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బైక్‌పై వచ్చి తన వెంట తెచ్చుకున్న కత్తితో బయట ఉన్న అత్త శారదను అత్యంత పాశవికంగా పీక కోశాడు. తన కళ్ల ఎదుటే ఈ దారు ణం చూసిన భర్త బాబూరావు తప్పించు కునేందుకు లోపలికి వెళుతుండగా ఇంటి ఆవరణలో కత్తితో ఆయన పీక కోశాడు. ఇద్దరు రక్తపు మడుగులో కొట్టుకుని అక్కడిక్కడే మృతి చెందారు. భార్యను చంపేందుకు ప్రయత్నించగా తలుపులు వేసుకుని కేకలు వేయడంతో కోటేశ్వరరావు అక్కడ నుంచి పారి పోయాడు. సంఘటన జరిగిన వెంటనే కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌, సీఐ బాలశౌరి, దేవరపల్లి సీఐ నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఈ వృద్ధ దంపతులు ఘంటవారిగూడెం సెంటర్‌లో హోటల్‌ నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో గ్రామస్తులు భయందోళన చెందారు. హత్య చేసిన నిందితుడు కోటేశ్వరరావును 24గంటలలోపు పట్టుకుని కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 11:48 PM