అసంపూర్తి ఇళ్లకు అదనపు సాయం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:57 AM
స్వర్ణాంధ్ర 2047 విజన్ సా కారంతో భాగంగా 2029 నాటికి అందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 12( ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర 2047 విజన్ సా కారంతో భాగంగా 2029 నాటికి అందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బు ధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పీఎంఏవై 1.0 అర్బన్, గ్రామీణ్ 1.0 పథకాల ద్వారా 429 లే అవుట్లలో, సొంత స్థలాల్లో ఇళ్లు మంజూ రుకాగా, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు సం బంధించి 11,345 మంది ఎస్సీలు, 549 మంది ఎస్టీలు, 15547 మంది బీసీలు కలిసి 27,441 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం కింద రూ. 138.57 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా ఎస్సీ లకు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల మేర ఆర్థిక సహాయం అంది స్తామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకు ని లబ్ధిదారులంతా మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కోరారు. జూన్ 4వ తేదీ నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన జిల్లాకు 10,794 ఇళ్లు పూర్తిచేసేందుకు లక్ష్యంకాగా, ఇప్పటివరకు 4,796 ఇళ్లు పూర్తిచేశామని కలెక్టర్ తెలిపారు.