Share News

పీహెచ్‌సీల్లో పడకేసిన వైద్యం

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:33 AM

మెడికల్‌ ఆఫీసర్ల సమ్మెతో జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యం పడకేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినట్టు చెబుతున్నప్పటికీ మంగళవా రం వైద్యులు ఎవరూ హాజరు కాలేదు.

పీహెచ్‌సీల్లో పడకేసిన వైద్యం

17 మంది సమ్మెకు దూరం

వైద్యం అందక ప్రజలు విలవిల

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

మెడికల్‌ ఆఫీసర్ల సమ్మెతో జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యం పడకేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసినట్టు చెబుతున్నప్పటికీ మంగళవా రం వైద్యులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో స్టాఫ్‌ నర్సలే వైద్యులుగా వ్యవహ రించడం గమనార్హం. సెప్టెంబరు చివరి వారం నుంచి మెడికల్‌ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరిగా పీజీ సీట్లలో వెయిటేజీ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 37 పీహె చ్‌సీల వద్ద డాక్టర్లు సమ్మె ఆరంభించారు. జిల్లాలో 37 పీహెచ్‌సీల్లో 20 మంది డాక్టర్లు సమ్మె చేస్తుండగా 17 మంది సమ్మెకు దూ రంగా ఉన్నారని జిల్లా అధికారులు చెబు తు న్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరం మెడికల్‌కాలేజికి చెందిన సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు పలు బాధ్యతలు అప్పగించారు.స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బం ది తో కలుపుకుని సుమారు 200 మందికి మూడు షిఫ్ట్‌లుగా డ్యూటీలు కేటాయించినట్టు తెలిపారు.వీరికి ఉదయం 8 నుంచి 2 గంటల వరకూ ఒకషిఫ్ట్‌, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటలకు వరకూ మరో షిఫ్ట్‌, రాత్రి 8 నుం చి మర్నాడు ఉదయం 8 గంటల వరకూ మ రో షిఫ్ట్‌ కేటాయించారు.రెస్పాన్స్‌బుల్‌ సూప ర్‌వైజర్స్‌గా కొంతమంది, ఐదుగురు ప్రోగ్రామ్‌ ఆఫీసర్లను నియమించారు.దీపావళి ముందు రోజు కొందరు పీహెచ్‌సీలను పట్టించుకో లేదు.దీపావళి రోజు సుమారుగా మూసేసినట్టే. ఇక మంగళవారం వైద్యులెవరు హాజరు కాలే దు. దీంతో స్టాఫ్‌ నర్సులే సర్వం చూస్తుండడం గమనార్హం.జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యం పడ కేసింది. సబ్‌ సెంటర్లదీ ఇదే పరి స్థితి. వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 01:33 AM