హోరుడింగ్స్!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:20 AM
అటు చూడు.. అటు కాదు.. ఇటు చూడు.. నగరాలకు వెళ్లి ఏ వైపు చూసినా హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. ఎక్కడా ఖాళీ అనేదే ఉం డదు.
ఎటు చూసినా కనిపించేవి అవే
రోజురోజుకు పెరుగుతున్న బోర్డులు
ఆ స్థాయిలో కానరాని ఆదాయం
అధికారులకు మామూళ్లు
దృష్టి సారించిన కూటమి సర్కారు
ఆన్‌లైన్ చేసే పనిలో నిమగ్నం
అవినీతికి చెక్ పెట్టే ప్రయత్నం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
అటు చూడు.. అటు కాదు.. ఇటు చూడు.. నగరాలకు వెళ్లి ఏ వైపు చూసినా హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. ఎక్కడా ఖాళీ అనేదే ఉం డదు. నగరాలు, పట్టణాలు, పంచా యతీలు ఎక్కడ చూసినా ప్రకటన బోర్డులతో నిండిపో తాయి. ఏ వైపు చూసినా అవే కనిపిస్తాయి. స్థానిక సంస్థలకు ఆదాయం సమకూర్చ డం లో ప్రకటనల బోర్డులు (హోర్డింగ్స్) కీలక భూమిక పోషిస్తాయి. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.రెండో వైపు టౌన్ ప్లానింగ్ జేబులను మామూళ్లతో నింపడంలోనూ ముందు వరుస లోనే ఉంటాయి. కానీ ఆయా స్థానిక సంస్థ లకు ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రావడం లేదనేది జగమెరిగిన వాస్తవం. ఆకాశమంత హోర్డింగ్ ఉన్నా అత్తెసరు రాబడే వస్తోంది. ఇప్పుడు వీటంన్నిటికీ కూటమి ప్రభుత్వం సాం కేతిక సహాయంతో చెక్ పెట్టనుంది.
లెక్కలేనివెన్ని..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు కార్పొ రేషన్లు, మునిసిపాలిటీలు 9, నగర పంచా యతీలు 3, మేజర్ పంచాయతీలు 150 ఉంటా యి.ఆయా ప్రాంతాల్లో అధికారికంగా 2 వేల వరకూ హోర్డిం గ్‌లు ఉండగా.. సరిగ్గా లెక్కవేస్తే ఆ అంకెకు మరో మూడు వేలు కలిసినా తక్కువేం కాదు. ఎందు కంటే ఒక్క రాజమహేంద్రవరంలోనే సుమారు 2 వేల హోర్డింగ్‌లుపైనే ఉంటాయి. అందుకు తగినట్టు మూడు జిల్లాల్లో కూడా ఆదాయం రావడం లేదు. ఇప్పుడు సాంకే తిక ప్రక్రియ పూర్తయి ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే పూర్తిగా కాకపోయినా చాలా వరకూ అవినీతికి చెక్ చెప్పినట్లే.
ఏ జంక్షన్ చూసినా..
రైల్వే క్రాసింగ్‌లు, వంతెనలు, పాఠశా లలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాల యాలు, ట్రాఫిక్ జంక్షన్లు, రహదారుల మధ్యలో, వాహనాల రాకపోకలకు అడ్డుగా, పురావస్తు ప్రదేశాలు, వారసత్వ భవనాలపై, దేవాలయాలు, చర్చిలు, మసీదులపై ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయకూడదు. కానీ ఇవేం జరగడంలేదు. రాజమహేంద్ర వరంలోనే చూస్తే ఏ జంక్షన్ చూసినా ప్రకటన బోర్డులు దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
అనుమతుల్లేకపోతే
రూ.50 వేల జరిమానా
హోర్డింగులపై కూటమి ప్రభుత్వం సీరి యస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే జీవో ఎంఎస్ నెం 253ను జారీ చేసింది. ది ఆంధ్ర ప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిస్‌ప్లే డివైజెస్(ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్) ఎన్ అర్బన్ లోకల్ బాడీస్ రూల్స్- 2025 పేరుతో మార్గనిర్దేశం చేసింది. ఇకపై హోర్డింగ్‌ను డిస్‌ప్లే డివైజ్‌లుగా వ్యవహరించ నున్నారు. వీటిని మూడు కొలతల్లో విభజిం చారు. 300 చదరపు అడుగులు ఉంటే చిన్నవి, 600 చదరపు అడుగుల వరకూ మధ్యస్తం, ఆపై 1200 చదరపు అడుగుల వరకూ భారీ డిస్ ప్లేలుగా అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనలకు రోజుకు రూ.300 నుంచి రూ.30 వేల వరకూ జరి మానా విధిస్తారు.అనుమతుల్లేకుండా ఏర్పాటు చేస్తే రోజుకు రూ.50 వేల అపరాధ రుసుం చెల్లించాల్సిందే. మళ్లీ అదే పునరావృతమైతే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేస్తా రు.డిస్‌ప్లే డివైజ్‌లకు మూడేళ్ల పాటు అను మతిస్తారు. తాత్కాలిక అనుమతులు 30 రోజు ల వరకూ మాత్రమే ఇస్తారు.
ప్రకటన బోర్డులు ఆన్‌లైన్..
హోర్డింగ్‌ల వల్ల స్థానిక సంస్థలతో సమా నంగా అధికారులు, సిబ్బంది వసూళ్లు ఉంటా యి. నిబంధనలకు విరుద్ధగా ఇష్టానుసారం ఏర్పాటు చేసినవి లెక్కల్లోకి రాకుండా అధికా రుల మనసులోనే ఉంటాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ చిట్టాకు సాంకేతికతను జోడించనుంది. ప్రస్తుతం ఉన్న డిస్‌ప్లే బోర్డుల వివరాలను ఎంఏ యూడీ డిపార్ట్‌మెంట్ వెబ్ సైటు పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. కొత్తగా అనుమతులు అదే పోర్టల్ ద్వారా జారీ చేస్తారు. రుసుముల చెల్లింపు, గడుపు దాటితే ఆ బోర్డుల తొలగింపు వంటి వన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగు తుంది. ఇంకా కీలకమైన విషయం ఏమిటంటే.. ఆయా బోర్డులపై క్యూఆర్ కోడ్‌ని ముద్రిస్తారు. అది స్కాన్ చేస్తే బోర్డు చిట్టా మొత్తం వచ్చే స్తుంది. క్యూఆర్ కోడ్‌తో పాటు అనుమతి సంఖ్య, ప్రకటనకర్త వివరాలు, ఫోన్ నెంబరు, జీఎస్టీ నెంబరును విధిగా ప్రచురించాలి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తి కానుంది.