చేబ్రోలులో గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:43 AM
గొల్లప్రోలురూరల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శుక్రవారం రాష్ట్రస్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు నిర్వహించగా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. చేబ్రోలు బైపాస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసం చెంతనే ఉన్న రహదారిలో సీతారామా ఆలయకమిటీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 30కిపైగా గుర్రాలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తొలిసారి

భారీగా తరలివచ్చిన ప్రజలు, కిక్కిరిసిన రహదారులు
అనకాపల్లి అశ్వానికి మొదటిస్థానం
గొల్లప్రోలురూరల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శుక్రవారం రాష్ట్రస్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు నిర్వహించగా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. చేబ్రోలు బైపాస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసం చెంతనే ఉన్న రహదారిలో సీతారామా ఆలయకమిటీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 30కిపైగా గుర్రాలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తొలిసారి గుర్రాల పోటీలు నిర్వహించడంతో వీటిని తిలకించేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పరిసర రహదారులన్ని జనసందోహం తో కిక్కిరిసిపోయాయి. గుర్రాలు పరుగెడుతుం టే ఉత్సాహంగా వారి వెంట పరుగెత్తేందుకు ప్రజలు ప్రయత్నించడంతో వారిని నియంత్రించడం నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది. పోటీల్లో తొలి పది స్థానాల్లో నిలిచిన గుర్రాలకు నగదు పురస్కారాలు, షీల్డులు అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి, పాయకరావుపేట జనసేన ఇన్‌చార్జిలు గడ్డం బుజ్జి, ఓరుగంటి పెదకా పు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బుర్రా అనుబాబు, ఓరుగంటి దొరబా బు, బుద్దాల చంటి, చల్లా లక్ష్మి, శివ, పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విజతలు వీరే...
రాష్ట్రస్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీల్లో నిర్దేశించిన 2.20 కిలోమీటర్ల దూరాన్ని అనకాపల్లి జిల్లా చేనుల అగ్రహారం మణి(జెస్సీ)కి చెందిన గుర్రం 3 నిమిషాల 2 సె కన్ల 18 పాయింట్ల సమయంలో పరుగెత్తి ప్రథమస్థానంలో నిలిచింది. రామన్నపాలెం చోడమాంబిక విక్రమ్ గుర్రం 3-21-08 సమయంలో, అంకుపాలెం మోదమాంబ మురుగన్ గుర్రం 3-21-87 సమయంలో, ఆర్‌ఆర్‌పేట దాడి రాముడు(భగి) గుర్రం 3-22-37, దేవర సింగపూరు సత్యనారాయణ గుర్రం 3-25-54, కోటనందూరు శివరాజు బ్రదర్స్(రాఖి) గుర్రం 3-27-05, సామర్లకోట జగదీష్ రాజా గుర్రం 3-30-17, శివరాజు బ్రదర్స్(చిన్ని) గుర్రం 3-31-11, ఆర్‌ఆర్ పేట దాడి నూర్ హనుమంత్ (చిన్ని) గుర్రం 3-31-92, రామన్నపాలెం చోడమాంబిక రాకెట్ గుర్రం 3-32-65 సమయంలో పరుగెత్తి తొలి పదిస్థానాల్లో నిలిచాయి. బెస్ట్ రైడర్‌గా మణికంఠ ఎంపికయ్యారు.