జ్యోత్స్న అకాల మృతి బాధాకరం
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:13 AM
తుని రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురా లు జ్యోత్స్న అకాల మృతి బాధాకరమని, ఉపాఽధ్యాయురాలు పిల్లలకు వచ్చిన కష్టం తలుచుకుంటే చాలా బాధగా ఉందని హోం మంత్రి అనిత భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలోని జడ్పీ హైస్కూల్లో భవ
తునిలో ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి అనిత
తుని రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురా లు జ్యోత్స్న అకాల మృతి బాధాకరమని, ఉపాఽధ్యాయురాలు పిల్లలకు వచ్చిన కష్టం తలుచుకుంటే చాలా బాధగా ఉందని హోం మంత్రి అనిత భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలోని జడ్పీ హైస్కూల్లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగి తునికి చెందిన ఉపాధ్యాయురాలు జ్యోత్స్న మృతిచెందడంతో శనివారం తుని బ్యాంక్ కాలనీలో ఆమె పార్ధివదేహానికి హోం మంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్పించారు. జ్యోత్స్న ఇద్దరి పిల్లలను చూసి చలించిపోయారు. వారిని దగ్గరకు తీసుకుని చదువుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పిల్లల చదువు, ఉద్యోగానికి సంబంధించిన కొన్ని వెలుసుబాటును కుటుంబ సభ్యులు హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారని, ఉపాధ్యాయురాలు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హోం మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని సకాలంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయురాలి పెద్ద అబ్బాయి ప్రస్తుత ఉద్యోగ అర్హత వయస్సు రాకపోవడంతో రెండేళ్ల తరువాత ఉద్యోగం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. యనమల రాజేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ నార్ల భువన సుందరి, రాష్ట్ర పౌరసరఫరాల డైరెక్టర్ బోడపాటి శివదత్ ఉన్నారు.