హెచ్‌ఎంను బదిలీ చేయాలని నిరాహార దీక్ష
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:27 AM
ముం గండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు జి.కనకదుర్గను ఇక్కడ నుంచి తక్షణ బదిలీ చేయాలని పాఠశాల కో-ఆప్షన్ సభ్యుడు, డోనరు పినిశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
పి.గన్నవరం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ముం గండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు జి.కనకదుర్గను ఇక్కడ నుంచి తక్షణ బదిలీ చేయాలని పాఠశాల కో-ఆప్షన్ సభ్యుడు, డోనరు పినిశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో మంగ ళవారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు పోతవరం గ్రామసర్పంచ్ వడలి కొం డయ్య, స్థానిక సర్పంచ్ భర్త కుసుమ వెంకటే శ్వరరావు, పలువురు స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో తాను గేటు బాగుచేయిస్తే నన్ను దొంగలా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు, సిబ్బం దిపై హెచ్‌ఎం చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తు న్నారని అన్నారు. ఎంఈవో కె.హెలీనా పాఠశా లకు చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. దీంతోరామచంద్రపురం డివైఈవో పి.శ్రీరామలక్ష్మణమూర్తి శిబిరం వద్దకు చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. హెచ్ ఎంను బదిలీ చేయాలని అప్పటి వరకు దీక్ష కొనసాగు తుందని వారు తేల్చిచెప్పారు. ఎమ్మె ల్యే, ఉన్న తాధికారులతో డీవైఈవో ఫోన్‌లో మాట్లాడారు. విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయని, మీరు అనుకున్నట్టే జరు గుతుందని నిరసనకారులకు డీవైఈవో హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో హెచ్ ఎంను బదిలీ చేయకపోతే మీతో పాటు పోరాడ తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని స్థానిక నాయకులు చెప్పారు. దీంతో వెంకటేశ్వరరావుకు డీవైఈవో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అలాగే హెచ్‌ఎం వేధింపులు తాళ లేక ఈఏడాది ఫిబ్రవరి 22న ఉపాధ్యాయు రాలు డి.ఎస్. డి.లావణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఉపాధ్యాయులందరూ నిరసనకు దిగిన విషయం విదితమే.