గొల్లప్రోలులో హిందూ సంఘాల ఆందోళన
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:16 AM
గొల్లప్రోలు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలులో హిందూ సంఘాల ఆందోళన, అదే సమయంలో చర్చిల వద్దకు వెళ్లేందుకు క్రైస్తవులు
చర్చిలు మూసివేయాలని డిమాండ్
ఆరుగంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు
తాత్కాలికంగా మూసివేతకు ఆదేశం
పోలీసు పికెట్ ఏర్పాటు
గొల్లప్రోలు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలులో హిందూ సంఘాల ఆందోళన, అదే సమయంలో చర్చిల వద్దకు వెళ్లేందుకు క్రైస్తవులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చర్చిలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్డీవో ఆదేశించారు. సుమారు ఆరుగంటలు పాటు ఆందోళనలు, ఉద్రిక్తతలు కొనసాగాయి.
అసలేం జరిగిందంటే...
గొల్లప్రోలు కొత్తపేట ప్రాంతంలో ఉన్న రెండు చర్చిల నిర్వహణపై అక్కడ స్థానికులు కొంతకాలంగా అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎటు వంటి అనుమతులు లేకుండా చర్చిలు నిర్వహిస్తున్నారని, లౌడ్‌స్పీకర్లు వినియోగిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో హిందూ సంఘాలు ఆందోళన కు పిలుపునిచ్చాయి. హిందూ ధర్మ రక్షా సమి తి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య ఆ ధ్వర్యంలో చర్చిల ప్రాంతంలో ఆందోళనకు ది గారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్ప డ్డాయి. అదే సమయంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. దీంతో కాకినాడ రూరల్, త్రీ టౌన్ సీఐలు చైతన్యకృష్ణ, సత్యనారాయణల ఆధ్వర్యంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి ఎస్‌ఐలు రామకృష్ణ, మణికుమార్, లోకేష్, వెంకటేష్ అక్కడకు చేరుకున్నారు. హిందూ సంఘాలతో చర్చలు జరిపారు. చర్చిలు మూ సివేసే వరకూ ఆందోళన విరమించేది లేదం టూ గవరయ్య స్పష్టం చేశారు. చర్చిల్లో ఉన్న వారిని బయటకు పంపివేశారు. కొంత సమ యం తర్వాత క్రైస్తవులు అక్కడకు చేరుకునేందుకు గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయం నుంచి తరలివచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు.
ఆర్డీవో చర్చలు
విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, గొల్లప్రోలు తహశీల్దార్ రామ్‌కుమార్, నగరపంచాయతీ టీపీవో దీప్తి కొత్తపేటకు చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జ రిపారు. చర్చిలకు అనుమతులు లేవని, ఆక్ర మణలు ఉన్నాయని హిందూ సంఘాల ప్రతినిధులు ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు.కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్న రెండు చర్చిలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్తపేట ప్రా ంతంలో సీఆర్‌పీసీ 144వ సెక్షన్ కింద నిషేదాజ్ఞలు విధించారు. ఆక్రమణలు ఉన్నాయన్న ఫి ర్యాదుల మేరకు సర్వే నిర్వహించి మార్కింగ్ చేయాలని టీపీవోను ఆర్డీవో ఆదేశించారు. అ నంతరం తహశీల్దారు కార్యాలయంలో చర్చిల నిర్వాహకులతో చర్చలు జరిపారు. కలెక్టర్‌ను సోమవారం కలవాలని సూచించారు. మరోవైపు ఆర్డీవో హామీతో హిందూ సంఘాలు ఆం దోళన విరమించాయి. అక్కడ ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గానూ ముందుజాగ్రత్త చర్యగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.