Share News

హీరో ప్రభాస్‌ పేరున కుంకుమార్చన

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:55 AM

తుని రూరల్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దివంగత సినీ నటుడు, పార్లమెంట్‌ సభ్యుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవ దేవస్థా

హీరో ప్రభాస్‌ పేరున కుంకుమార్చన
అమ్మవారికి సారె సమర్పిస్తున్న శ్యామలాదేవి

‘లోవ’లో శ్యామలాదేవి ప్రత్యేక పూజలు

తుని రూరల్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దివంగత సినీ నటుడు, పార్లమెంట్‌ సభ్యుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాస పర్వదినాలను పురస్కరించుకుని అ మ్మవారికి సారె సమర్పించారు. అనంతరం సినీ హీ రో ప్రభాస్‌ పేరున కుంకుమార్చన నిర్వహించారు. ఆల య పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి అమ్మవారి మహా ప్రసాదాన్ని శ్యామ లాదేవికి అందజేశారు. ఆమె మాట్లాడుతూ తూర్పు కనుమల్లో ఆహ్లాదకర వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, పండితులు ఆలయ వైభవాన్ని చెప్పిన తర్వాత ఏటా అమ్మవారిని దర్శించుకోవాలని కోరిక కలిగిందని ఆమె తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 12:55 AM